తెలుగు ప్రేక్షకులకు అనన్య శర్మ ( Ananya Sharma )గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.ఈమె యూట్యూబ్లో చాలా షార్ట్ ఫిలిమ్స్ అలాగే వెబ్ సిరీస్ ల ద్వారా ప్రేక్షకులకు బాగా చేరువ అయింది.
ఈమె నటించిన వెబ్ సీరియస్లకు సంబంధించిన వీడియోలు యూట్యూబ్ లో ఇంస్టాగ్రామ్ లో వైరల్ అవుతూనే ఉంటాయి.అలా సోషల్ మీడియా ద్వారా బాగా క్రేజ్ ని సంపాదించుకుంది.
మరి ముఖ్యంగా అర్థమయిందా అరుణ్ కుమార్ అనే వెబ్ సిరీస్ తో ప్రేక్షకులకు బాగా చేరువ.ఈ సిరీస్ లో బాగా నటించినందుకు గాను ఆమెకు ఫుల్ మార్క్స్ పడ్డాయని చెప్పాలి.
ఆ తర్వాత 20 వెడ్స్ 30( 20 Weds 30 ) అనే వెబ్ సిరీస్ తో కూడా బాగానే గుర్తింపు తెచ్చుకుంది.ఇది ఇలా ఉంటే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న అనన్య శర్మ అనేక అంశాల గురించి స్పందించింది.నాకు సోషల్ మీడియాలో ఎక్కువగా యాక్టివ్ ఉండడం అసలు ఇష్టం లేదు.ప్రైవేట్ లైఫ్ గడపడం అంటే చాలా ఇష్టం.నేను ఫోన్ పెద్దగా యూస్ చేయను నేను పెద్ద ఫోన్ పర్సన్ ని కాదు.అలాగే ఎవరికీ రిప్లై ఇవ్వను.
అందుకే నన్ను అంతా ఆటిట్యూడ్ పర్సన్ అని అందరూ అనుకుంటూ ఉంటారు.అలాగే మొదట్లో నేను ఇండస్ట్రీలోకి రావడాన్ని ఎవరూ ఇష్టపడలేదు.
అయితే తన పెళ్లి విషయం వచ్చేసరికి మంచి మనసున్న, నిజాయితీ ఉన్న అబ్బాయి వస్తే చేసుకుంటాను అని ఒక వేళా అతనికి జాబ్ లేకపోయినా కూడా పెళ్లి చేసుకుంటాను అని చెప్పింది.
జీవితంలో ప్రేమ ఉండాలి తర్వాత ఆటోమేటిక్ గా డబ్బులు సంపాదించుకోవచ్చు అని తెలిపింది అనన్య.ఇంజనీరింగ్ చేసిన అనన్య ఒక వేళా మూవీ అవకాశాలు లేనప్పుడు అప్లికేషన్ పెట్టుకుని జాబ్ చేసుకోవడానికైనా వెళ్ళిపోతా అని చెప్పింది.30 వెడ్స్ 21 అనే వెబ్ సిరీస్ లో హీరోయిన్ గా నటించిన అనన్య మంచి మంచి మూవీ ఛాన్సెస్ నటనకు స్కోప్ ఉన్న పాత్రలను ఎంచుకుంటూ వెళ్తోంది.బాయిస్ ఫార్ములా అనే యూట్యుబ్ చానెల్ ద్వారా ప్రేక్షకులకు పరిచయమయ్యింది.