సాధారణంగా కొందరికి రాత్రుళ్ళు నిద్ర సరిగ్గా పట్టదు.నిద్రపోవాలని ఎంత ప్రయత్నించినా కూడా కంటికి కునుకు రాదు.
సరైన నిద్ర లేకపోవడం వల్ల ఉదయానికి అయోమయంగా ఉంటుంది.కోపం, చిరాకు తారస్థాయిలో ఉంటాయి.
చేసే పనిపై ఏకాగ్రత పెట్టలేకపోతుంటారు.ఈ క్రమంలోనే రాత్రుళ్ళు నిద్రపోవడానికి స్లీపింగ్ పిల్స్( Sleeping pills ) వైపు మొగ్గు చూపుతుంటారు.
కానీ వాటి అవసరం లేకుండా కూడా హాయిగా ప్రశాంతంగా నిద్ర పోవచ్చు.అందుకు ఇప్పుడు చెప్పబోయే టీ చాలా బాగా సహాయపడుతుంది.
రోజు నైట్ ఈ టీ తాగితే నిద్ర తన్నుకొస్తుంది.మరి ఇంతకీ ఆ టీ ఏంటి.? దాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి.? అనేది ఇప్పుడు తెలుసుకుందాం.ముందుగా స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని అందులో ఒక గ్లాస్ వాటర్ పోసుకోవాలి.వాటర్ హీట్ అయ్యాక అర అంగుళం దాల్చిన చెక్క( Cinnamon ), రెండు దంచిన లవంగాలు( cloves ), అర టీ స్పూన్ అల్లం తురుము( Grate ginger ) వేసి నాలుగు నిమిషాల పాటు మరిగించాలి.
ఆ తర్వాత గుప్పెడు గులాబీ రేకులు( rose petals ) వేసి మరొక నాలుగు నిమిషాల పాటు మరిగిస్తే మన టీ అనేది రెడీ అవుతుంది.
ఈ రోజ్ టీ ను ఫిల్టర్ చేసుకుని ఒక స్పూన్ తేనె( honey ) కలిపి నైట్ నిద్రించడానికి గంట ముందు సేవించాలి.ఈ టీ నిద్ర హార్మోన్లను ప్రభావితం చేస్తుంది.ఒత్తిడిని దూరం చేసి మైండ్ ను రిలాక్స్ చేస్తుంది.
ప్రశాంతమైన నిద్రను మీ సొంతం చేస్తుంది.కంటి నిండా నిద్రపోవాలి అనుకునేవారు తప్పకుండా తమ డైట్ లో ఈ టీను చేర్చుకోండి.
పైగా ఈ టీ జీర్ణ వ్యవస్థను చురుగ్గా మారుస్తుంది.గ్యాస్, ఎసిడిటీ, మలబద్ధకం వంటి సమస్యలకు చెక్ పెడుతుంది.
పొట్ట చుట్టూ పేరుకుపోయిన కొవ్వును కరిగిస్తుంది.మరియు చర్మాన్ని అందంగా ప్రకాశవంతంగా సైతం మెరిపిస్తుంది.