టోక్యోలోని గింజా కిటాఫుకు రెస్టారెంట్‌లో( Ginza Kitafuku restaurant in Tokyo ) ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన మిషెలిన్ స్టార్ టేస్టింగ్ మెనూ లభ్యమవుతుంది.ఈ భోజనం ఒక్కొక్కరికి నుంచి 2,130 డాలర్లు (రూ.1.80 లక్షలు) వసూలు చేస్తుంది.ఈ మెనూలో జపాన్‌లో ఎంతో విలువైన స్నో క్రాబ్ డిష్ ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది.ఈ రెస్టారెంట్ వన్-స్టార్ మిషెలిన్ రేటింగ్ సొంతం చేసుకుంది.స్నో క్రాబ్ ( Snow crab )లేదా మంచు పీత వంటకాలతో ప్రపంచవ్యాప్తంగా ఎంతో మందిని ఇది ఆకర్షిస్తుంటుంది.
గింజా కిటాఫుకులో భోజనం చేసేవారు నేలపై కూర్చోవాలి.
భోజనం చేయడానికి ముందు తమ చెప్పులు విప్పాలి.అతిథులు చెఫ్ తమ ముందు స్నో క్రాబ్‌ను ఎలా ప్రత్యక్షంగా తయారు చేస్తున్నారో చూడవచ్చు.
ఈ ప్రక్రియ అసౌకర్యంగా అనిపిస్తే, ఆరవ అంతస్తులోని ప్రైవేట్ డైనింగ్ రూమ్‌ను ఎంచుకోవచ్చు.తక్కువ బడ్జెట్ ఉన్నవారి కోసం, ఈ రెస్టారెంట్ 258 డాలర్లకు రెడ్ కింగ్ క్రాబ్ భోజనాన్ని కూడా అందిస్తుంది.
ప్రపంచంలోని ప్రసిద్ధ ఆహార పత్రికలలో ఒకటైన చెఫ్స్ పెన్సిల్ ప్రకారం, 2024లో అత్యంత ఖరీదైన మిషెలిన్ స్టార్ రెస్టారెంట్‌గా టోక్యోలోని గింజా కిటాఫుకు నిలిచింది.
రెండవ స్థానంలో షాంఘైలోని పాల్ పైరెట్ అండ్ అల్ట్రావయోలెట్ రెస్టారెంట్( Paul Pirate and Ultraviolet Restaurant in Shanghai ) ఉంది.3 స్టార్ మిషెలిన్ రేటింగ్ గెలుచుకున్న ఈ రెస్టారెంట్ తన టేస్టింగ్ మెనూకు 1,230 డాలర్లు వసూలు చేస్తుంది.అల్ట్రావయోలెట్ ఫ్రెంచ్ వంటకాలను ప్రపంచ రుచులతో కలిపి ప్రత్యేకమైన భోజన అనుభవాన్ని అందిస్తుంది.
మూడవ స్థానంలో న్యూయార్క్ సిటీలోని కావియర్ రస్సే ఉంది.ఇక్కడ అతిథులు కావియర్‌ను కేంద్రంగా చేసుకున్న 11 కోర్సుల టేస్టింగ్ మెనూను 950 డాలర్లకు ఆస్వాదించవచ్చు.టోక్యోలోని అజాబు కడోవాకి, న్యూయార్క్‌లోని మాసా వంటి ఇతర ప్రముఖ రెస్టారెంట్లు కూడా భోజనం 950 డాలర్లకు పైగానే ఉంటుంది.పారిస్‌లోని గై సావాయ్, శాన్ ఫ్రాన్సిస్కోలోని క్విన్స్, కోపెన్‌హేగన్‌లోని అల్కెమిస్ట్ వంటి ప్రసిద్ధ రెస్టారెంట్లను కూడా ఈ జాబితాలో నిలుస్తున్నాయి.