బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ( Kalvakuntla Kavitha )కొత్త రూట్లో తన రాజకీయాన్ని మొదలుపెట్టినట్టుగా కనిపిస్తున్నారు.ఢిల్లీ లిక్కర్ స్కాం (Delhi Liquor Scan )వ్యవహారంలో అరెస్ట్ అయ్యి, జైలుకు వెళ్లి బెయిల్ పై బయటకు వచ్చిన తరువాత నుంచి కవిత వైఖరిలో మార్పు కనిపిస్తోంది.
మొన్నటి వరకు రాజకీయాలకు దూరం అన్నట్టుగా కవిత వ్యవహరించారు.దీంతో కవిత పూర్తిగా రాజకీయాలకు దూరం కాబోతున్నారనే ప్రచారం తెలంగాణ రాజకీయ వర్గాల్లో జరిగింది.

కెసిఆర్ సలహాతో కవిత ప్రస్తుత రాజకీయాలకు దూరంగా ఉన్నారనే ప్రచారం కూడా నడిచింది.అయితే భారత్ లో ప్రముఖ వ్యాపార వేత్త గౌతమ్ ఆదానిపై( Gautham Adani ) అమెరికాలో కేసు నమోదైన వ్యవహారంపై బీజేపీ ని విమర్శిస్తూ కవిత తీవ్ర వ్యాఖ్యలు చేశారు.ఇక అప్పటి నుంచి ఏదో ఒక అంశంపై కవిత స్పందిస్తూనే వస్తున్నారు.కాకపోతే బీఆర్ఎస్ తరఫున కాకుండా తన సంస్థ అయిన జాగృతి పేరుతో విమర్శలకు, పరామర్శలకు దిగుతున్నారు.
నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఫుడ్ పాయిజన్ కు గురైన హాస్టల్ విద్యార్థులను ముందుగా బీఆర్ఎస్ నేతలు పరామర్శించారు. వారితో పాటు కవిత వెళ్లలేదు.ఆ తరువాత సొంతంగానే ఆ పరామర్శకు వెళ్లారు .

తనతో పాటు కొంతమంది జాగృతి నేతలను తీసుకువెళ్లారు.అక్కడ నుంచి బయటకు వచ్చిన తర్వాత మీడియాతో మాట్లాడిన సందర్భంలో ఎక్కడా బీఆర్ఎస్ ప్రస్తావన తీసుకురాకుండా కాంగ్రెస్ ప్రభుత్వం ప విమర్శలు చేశారు.బీఆర్ఎస్ పేరుతో కాకుండా సొంత రాజకీయం మొదలుపెట్టినట్లుగా కవిత వ్యవహారాన్ని బట్టి అర్థమవుతుంది.
దీనికి తగ్గట్లుగానే భారత జాగృతిని మళ్లీ తెలంగాణ జాగృతిగా కవిత మార్చారు.బీసీ రిజర్వేషన్లపై పోరాటం చేయబోతున్నారు.
బీఆర్ఎస్ కంటే భిన్నంగా కవిత రాజకీయం మొదలు పెట్టబోతున్నట్లుగా అర్థమవుతుంది.ఎన్నికల వరకు జాగృతి నేతగానే రాజకీయాలు చేసే విధంగా కనిపిస్తున్నారు.
దీంతో అంతర్గతంగా ఏం జరిగిందనే దానిపైనే అందరికీ ఆసక్తి నెలకొంది.కెసిఆర్ కుటుంబంలో ఏవైనా తగాదాలు ఉన్నాయా ? అందుకే కవిత విడిగా రాజకీయం మొదలు పెట్టారా అనే అనుమానాలు అందరిలోనూ కలుగుతున్నాయి.మరికొద్ది రోజుల్లోనే దీనికి సంబంధించి మరింత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.