అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ ( Donald Trump )విజయం సాధించడంతో అగ్రరాజ్యంతో పాటు ప్రపంచ రాజకీయాలు కూడా కీలక మలుపులు తిరుగుతున్నాయి.ఇమ్మిగ్రేషన్‌తో పాటు ముఖ్యంగా చైనాతో ట్రంప్ ఎలా వ్యవహరించబోతున్నారనేది చర్చనీయాంశమైంది.
టెక్ బిలియనీర్ ఎలాన్ మస్క్,( Tech billionaire Elon Musk ) భారత సంతతికి చెందిన పారిశ్రామికవేత్త వివేక్ రామస్వామి( Vivek Ramaswamy ) నేతృత్వంలో కొత్త విభాగాన్ని ఏర్పాటు చేసిన ట్రంప్.దీని సాయంతో ప్రభుత్వంలోని లోపాలను సరిదిద్దాలని యోచిస్తున్నారు.
అయితే ట్రంప్ దూకుడు, సమర్ధవంతమైన అమెరికా రాజకీయ వ్యవస్ధను చైనా ఎదుర్కోవడం అంత తేలిక కాదని ఓ చైనా సలహాదారు మీడియాతో అన్నారు.
ట్రంప్ 2.0లో ఎలాన్ మస్క్, వివేక్ రామస్వామి ఆధ్వర్యంలో నడవనున్న యూఎస్ ప్రభుత్వ విభాగం చైనాకు అతిపెద్ద ముప్పు అని చైనీస్ విద్యావేత్త, విధాన సలహాదారు జెంగ్ యోంగ్నియన్ ( Zheng Yongnian )అన్నారు.మరింత సమర్ధవంతమైన అమెరికా రాజకీయ వ్యవస్ధ చైనాపై ఒత్తిడి తీసుకొస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు.
చైనీస్ యూనివర్సిటీ ఆఫ్ హాంకాంగ్ (షెన్ జెన్ క్యాంపస్)లోని స్కూల్ ఆఫ్ పబ్లిక్ పాలసీ డీన్‌గా జెంగ్ వ్యవహరిస్తున్నారు.
ఒక్క చైనాకు మాత్రమే కాకుండా ఇతర దేశాలకు, ముఖ్యంగా యూరప్‌కు కూడా ఇది ప్రమాదకరమని జెంగ్ హెచ్చరించారు.డిపార్ట్‌మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియెన్సీ (డీవోజీఈ)కి నాయకత్వం వహించడానికి ఎలాన్ మస్క్, రామస్వామిలను ట్రంప్ నియమించిన సంగతి తెలిసిందే.వీరిద్దరూ ఇప్పటికే వేలాది నిబంధనలను రద్దు చేయాలని, ప్రభుత్వ శ్రామిక శక్తి పరిమాణాన్ని తగ్గించాలని వీరిద్దరూ భావిస్తున్నారు.వచ్చే ఏడాది జనవరి 20 నుంచి ట్రంప్ 2.0 ఆరంభం కానుంది.
గతంలో అమెరికా అధ్యక్షుడిగా ఉన్న సమయంలో చైనాపై కఠినంగా వ్యవహరించారు ట్రంప్.ఈసారి చైనాకు వ్యతిరేకంగా తైవాన్, దక్షిణ చైనా సముద్రం సహా వివిధ అంశాలలో దూకుడుగా ఉండాలని భావిస్తున్నారు.తన ప్రధాన భూభాగంలో తైవాన్ ఒక భాగమని చైనా నొక్కి చెబుతోంది.అలాగే దక్షిణ చైనా సముద్రంలో ఎక్కువ భాగంపై యాజమాన్య హక్కు తనదేనని అంటోంది.ఫిలిప్పీన్స్, వియత్నాం, మలేషియా, బ్రూనై, తైవాన్‌లతో చైనాకు సరిహద్దు వివాదాలు ఉన్నాయి.