అమెరికాలో భారతీయ జంట పెద్దమనసు .. స్కాలర్‌షిప్ ఫండ్ కోసం భారీ విరాళం

వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల కోసం విదేశాలకు వలస వెళ్లిన భారతీయులు కీలక స్థానాలకు చేరుకుంటున్న సంగతి తెలిసిందే.దేశం కానీ దేశంలో ఉన్నప్పటికీ వారు జన్మభూమిని మరిచిపోవడం లేదు.

 Indian American Couple Supports University Of Cincinnati, Uc Gen 11 Impact House-TeluguStop.com

ఎన్నో సామాజిక కార్యక్రమాలతో పాటు విదేశీ మారక ద్రవ్యాన్ని భారతదేశానికి అందిస్తున్నారు.ఈ క్రమంలో భారత సంతతికి పారిశ్రామికవేత్త, క్లౌడ్ సెక్యూరిటీ(Cloud Security) సంస్థ జే స్కేలర్ సీఈవో అయిన జే చౌదరి, అతని భార్య పీ.జ్యోతి చౌదరిలు తమ పెద్ద మనసు చాటుకున్నారు.అమెరికాలోని సిన్సినాటి విశ్వవిద్యాలయానికి(University of Cincinnati, USA) దాదాపు 4 మిలియన్ డాలర్ల విలువైన ఫండ్‌తో ‘‘చౌదరి ఫ్యామిలీ స్కాలర్‌షిప్ ఫండ్’’ను స్థాపించారు.

యూనివర్సిటీ వెబ్‌సైట్‌లోని నివేదిక ప్రకారం .యూసీ జెన్ 11 ఎంప్యాక్ట్ హౌస్(UC Gen 11 Impact House) అనే రెసిడెన్షియల్ కమ్యూనిటీలోని మొదటి తరం విద్యార్ధులకు ఈ ఫండ్ అండగా నిలబడనుంది.జే చౌదరి.యూసీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ అప్లైడ్ సైన్స్ నుంచి రెండు మాస్టర్ డిగ్రీలను పొందారు.అలాగే హెచ్ లిండ్నర్ కాలేజ్ ఆఫ్ బిజినెస్ నుంచి ఎంబీఏ (MBA)కూడా సంపాదించారు.జ్యోతి చౌదరి కూడా ఇదే సంస్థ నుంచి ఎంబీఏ పట్టా పొందారు.2025 చివరిలో కోర్సులు ప్రారంభించే దాదాపు 150 మంది విద్యార్ధుల యూసీ విద్యకు ఈ ఫండ్ నిధులు సమకూరుస్తుందని నివేదిక పేర్కొంది.యూసీ జెన్ 1 ప్రోగ్రామ్ 2008లో స్థాపించారు.

ఇందులో చేరిన వారికి విద్య, వ్యక్తిగతం, సామాజిక కార్యక్రమాలు ఉంటాయి.

కాగా.1958 ఆగస్ట్‌ 26న భారతదేశంలోని హిమాచల్‌ప్రదేశ్‌లోని ఉనా జిల్లాలో చిన్న గ్రామం పనోలో జన్మించారు జే.నిరుపేద కుటుంబం కావడంతో కష్టాల్లోనే ఆయన విధ్యాభ్యాసం సాగింది.ఏడు, ఎనిమిది తరగతులు చదివే సమయంలో గ్రామంలో విద్యుత్‌ సౌకర్యం అంతగా లేదు.దీంతో ఆయన చెట్ల కింద, వీధి దీపాల కిందనే చదువుకున్నారు.

Telugu Cloud Security, Jay Chaudhary, Jyoti Chaudhary, Uc Gen Impact, Cincinnati

పనో గ్రామానికి పొరుగున ఉన్న దుసార గ్రామంలోని హైస్కూల్‌కు జే ప్రతిరోజూ నాలుగు కిలోమీటర్లు నడిచివెళ్లి చదువుకునేవారు.ఎన్నో అవరోధాలను అధిగమించి జే వారణాసిలోని బెనారస్‌ హిందూ యూనివర్సిటీలో బీటెక్‌ పూర్తి చేశారు.యూనివర్సిటీ ఆఫ్‌ సిన్సినాటిలో మాస్టర్స్‌ చేసేందుకు ఆయన 1980లో తొలిసారిగా అమెరికా వెళ్లేందుకు విమానం ఎక్కారు.చదువు పూర్తయిన తర్వాత అమెరికాలోని ఐబీఎం, యూనిసిసి, ఐక్యూ వంటి దిగ్గజ టెక్ కంపెనీల్లో సేల్స్ , మార్కెటింగ్ విభాగాల్లో పాతికేళ్ల పాటు ఉద్యోగం చేశారు.

Telugu Cloud Security, Jay Chaudhary, Jyoti Chaudhary, Uc Gen Impact, Cincinnati

భార్య జ్యోతితో కలిసి ఉద్యోగానికి రాజీనామా చేసిన ఆయన.అప్పటి వరకు పొదుపు చేసిన మొత్తాన్ని పెట్టుబడిగా పెట్టి 1996లో సెక్యూర్ ఐటీ అనే స్టార్టప్‌ను ప్రారంభించారు.ఈ విజయంతో కోర్ హార్బర్, సైఫర్ ట్రస్ట్, ఎయిర్ డిఫెన్స్ వంటి సంస్థలను స్థాపించారు.అనంతరం 2008లో తన కంపెనీలన్నింటిని ప్రముఖ ఎలక్ట్రానిక్స్ దిగ్గజం మోటరోలాకు విక్రయించారు.

కాలిఫోర్నియాలోని బే ఏరియాలో జీస్కేలర్‌ కంపెనీని స్ధాపించిన జేకు ఇప్పుడు ఆ కంపెనీలో 45 శాతం వాటా ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube