దుబాయ్‌లో( Dubai ) నివసిస్తున్న భారతీయ మహిళ అనామికా రాణా( Anamika Rana ) ఇటీవల తన పనిమనిషి పై ఒక ఫిర్యాదు చేసి విమర్శల పాలయ్యింది.తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో వీడియోను పోస్ట్ చేసింది.
అందులో ఆమె పనిమనిషి( Maid ) ప్రవర్తనపై అసహనం వ్యక్తపరచడం కనిపించింది.తన పనిమనిషి పని సమయంలో సోఫాపై( Sofa ) దర్జాగా కూర్చొని, దానిపై వాలిపోయి ఫోన్‌లో మునిగిపోతున్నట్లు చూశానని చెప్పింది.ఈ విషయంలో తన ఫాలోవర్ల సలహా కోరుతూ, తన పనిమనిషిని ఎలా హద్దులో ఉంచాలో తెలియడం లేదని చెప్పింది.
“నేను నా పనివారిని కెమెరాలో చూశాను.ఆమె వాలి కూర్చుని ఫోన్‌లో బిజీగా ఉంది.కొంతమందికి ఇది పెద్ద విషయంగా అనిపించకపోవచ్చు.నేను మిలీనియల్ జనరేషన్‌కు చెందినదాన్ని, నా పనివారిది జెడ్ జనరేషన్ కావచ్చు.మనం వేర్వేరు తరాలకు చెందిన వాళ్ళం.
అంతేకాకుండా, నాకు ఇంతకు ముందు ఎప్పుడూ పనివారిని హ్యాండిల్ చేసిన అనుభవం లేదు” అని ఆమె తెలిపారు.
తన పనిమనిషి పనికి కొత్త అని కానీ తన పనిని చాలా బాగా చేస్తుందని కూడా ఆమె చెప్పారు.అయితే, తన పనివారి ప్రవర్తన గురించి ఎలా మాట్లాడాలనే విషయంలో ఆమె సందిగ్ధంలో పడింది.“సోఫాపై కూర్చోవద్దని నేను ఆమెతో వినయంగా చెప్పాలా? నేను అతిగా స్పందిస్తున్నానా?” అని ఆమె తన ఫాలోవర్లను అడిగింది.“మీరు ఈ పరిస్థితిలో ఎలా స్పందిస్తారు?” అని క్యాప్షన్‌లో క్వశ్చన్ చేసింది.
అనమిక రాణా వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారి, తీవ్ర వాదోపవాదాలకు తెరలేపింది.చాలామంది ఆమెను విమర్శించారు.“ఆమె సోఫా మీద కూర్చోడానికి అంత శుభ్రంగా లేకపోతే, మీ ఇంటిని ఎలా శుభ్రం చేస్తుంది?” అని ఒకరు ప్రశ్నించారు.మరొకరు, “సోఫా మీద ఎవరైనా కూర్చుంటారు కాబట్టి సమస్య లేదు.కానీ, పరుపు మీద కూర్చోవడం అంటే అతిగా చేయడమే” అని అన్నారు.మరొకరు, “ఇది తరాల గురించి కాదు.మీరు అతిగా స్పందిస్తున్నారు.
ఆమె మీ ఇంటిని శుభ్రం చేస్తుంది, కాబట్టి కొంతసేపు విశ్రాంతి తీసుకోనివ్వండి” అని అన్నారు.మరొకరు, “ఆమె సోఫా మీద ఎందుకు కూర్చోకూడదు?” అని ప్రశ్నించారు.