బిగ్ బాస్ హౌస్ లో డబుల్ ఎలిమినేషన్.. ఆ కంటెస్టెంట్ బలి కావడం ఖాయమా?

బుల్లితెర రియాలిటీ షో బిగ్ బాస్ షోను అభిమానించే అభిమానులు ఎక్కువగానే ఉన్నా బిగ్ బాస్ సీజన్8( Bigg Boss 8 ) మాత్రం ఆశించిన రేంజ్ లో సక్సెస్ కాలేదు.బిగ్ బాస్ సీజన్8 కు కంటెస్టెంట్లు మైనస్ కాగా వైల్డ్ కార్డ్ ఎంట్రీలలో వచ్చిన కంటెస్టెంట్లు సైతం ప్రేక్షకులను మెప్పించలేకపోయారు.

 Bigg Boss House Double Elimination Details, Bigg Boss 8 , Bigg Boss Telugu 8, Bi-TeluguStop.com

బిగ్ బాస్ షో సీజన్8 లో ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ఉండబోతుందని సమాచారం అందుతోంది.అవినాష్( Avinash ) టికెట్ టు ఫినాలే గెలిచి టాప్ 5లో చేరిన సంగతి తెలిసిందే.

ఈ వారం రోహిణి( Rohini ) మినహా మిగతా కంటెస్టెంట్లు అంతా ఎలిమినేషన్ జాబితాలో ఉన్నారు.నిఖిల్( Nikhil ) భారీ ఓటింగ్ తో టాప్ లో ఉండగా గౌతమ్( Gautham ) సెకండ్ పొజిషన్ లో నబీల్( Nabeel ) థర్డ్ ప్లేస్ లో ఉన్నారు.

ప్రేరణ, విష్ణుప్రియ, పృథ్వీ తర్వాత స్థానాలలో ఉండటం గమనార్హం.తేజ, అవినాష్ ఈ జాబితాలో చివరి స్థానాలలో ఉన్నారు.

Telugu Akhil, Avinash, Bigg Boss, Gautham, Nabeel Afridi, Prerana, Prithvi, Rohi

బిగ్ బాస్ హౌస్ నుంచి ఈరోజు తేజను( Teja ) ఎలిమినేట్ చేశారని ఒక వార్త సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతోంది.ఈ వారం చేసిన తప్పులు తేజకు మైనస్ అయ్యాయని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.గౌతమ్ పై నిందలు ఉండటం కూడా అతనికి మైనస్ అయింది.మరోవైపు బిగ్ బాస్ హౌస్ నుంచి రేపు ఎలిమినేట్ అయ్యే వ్యక్తి ఎవరనే చర్చ సోషల్ మీడియా వేదికగా జరుగుతుండటం గమనార్హం.

Telugu Akhil, Avinash, Bigg Boss, Gautham, Nabeel Afridi, Prerana, Prithvi, Rohi

రేపు పృథ్వీ( Prithvi ) ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.బిగ్ బాస్ షో సీజన్8 కు ఆశించిన స్థాయిలో రేటింగ్స్ అయితే రావడం లేదని చెప్పవచ్చు.బిగ్ బాస్ షోను ఈ సీజన్ తో తెలుగులో ఆపేస్తే బాగుంటుందని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.బిగ్ బాస్ షో టాలీవుడ్ రేంజ్ ను పెంచేలా ఉండి ఉంటే బాగుండేదని కొంతమంది కామెంట్లు చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube