టాలీవుడ్ దర్శకుడు సుకుమార్( Sukumar ) దర్శకత్వంలో పాన్ ఇండియా హీరో అల్లు అర్జున్( Allu Arjun ) హీరోగా నటించిన తాజా చిత్రం పుష్ప 2.( Pushpa 2 ) గతంలో విడుదలైన పుష్ప 1 సినిమాకు సీక్వెల్ గా ఈ సినిమా రూపొందిన విషయం తెలిసిందే.
ఈ సినిమా డిసెంబర్ 5వ తేదీన విడుదల కానుంది.ఈ సందర్భంగా మూవీ మేకర్స్ ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా బిజీ బిజీగా ఉన్నారు.
ఈ సందర్భంగా ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా అల్లు అర్జున్ మాట్లాడుతూ సుకుమార్ పై ప్రశంసల వర్షం కురిపించారు.
ఈ మేరకు అల్లు అర్జున్ మాట్లాడుతూ.నన్ను ఆర్య సినిమాతో( Arya ) స్టార్ ని చేసింది సుకుమార్.ఈరోజు నేను సక్సెస్ఫుల్ హీరోగా ఉన్నాను అంటే అందుకు కారణం సుకుమార్.
నా ఎదుగుదలకు కారణం ఆయనే.ఇంత వేడుక జరుగుతున్న ఆయన రాలేదు.
ఇంకా సినిమా పనుల్లోనే బిజీగా ఉన్నారు.ఇన్ని డబ్బులొస్తాయి.
ఇంత పేరొస్తుంది అని లెక్కలేసుకొని చేసిన సినిమా కాదది.ప్రేక్షకులకు ఒక బెస్ట్ ఇవ్వాలి, గొప్ప ఎక్స్‌పీరియన్స్ ఇవ్వాలి అని చేసిన సినిమా.
పుష్ప2 బిగ్గెస్ట్ ఇండియన్ సినిమా అయ్యిందంటే కారణం మీ ఆదరణే అని అల్లు అర్జున్ తెలిపారు.అల్లు అర్జున్ చేసిన వాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.ఇకపోతే మరొక ఐదు రోజుల్లో విడుదల కాబోతున్న పుష్ప 2 సినిమా కోసం అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.ప్రస్తుతం ఎక్కడ చూసినా కూడా పుష్ప సినిమా మేనియానే కనిపిస్తోంది.
అలాగే ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్లు, పాటలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ముఖ్యంగా ఈ సినిమా నుంచి తాజాగా విడుదలైన ఐటమ్ సాంగ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతోంది.