అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా నటించిన పుష్ప 2 సినిమా(Pushpa 2 Movie)విడుదల కానున్న నేపథ్యంలో ఎంతోమంది ఈ సినిమాని టార్గెట్ చేశారని తెలుస్తుంది.ఈ క్రమంలోనే పరోక్షంగా సోషల్ మీడియా వేదికగా పోస్టులు చేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు ముఖ్యంగా టీడీపీకి చెందిన ఎంపీలు ఎమ్మెల్యేలు కూడా పరోక్షంగా అల్లు అర్జున్ సినిమా గురించి పోస్టులు చేస్తూ సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.
తాజాగా నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి (Shabari) అల్లు అర్జున్ పుష్ప 2 సినిమా గురించి సోషల్ మీడియా వేదికగా షాకింగ్ పోస్ట్ చేశారు అయితే వెంటనే ఆమె డిలీట్ చేశారు కానీ ఈ పోస్ట్ మాత్రం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.
ఈమె ఈ సినిమాని ఉద్దేశించి పోస్ట్ చేస్తూ.అల్లు అర్జున్ (Allu Arjun)గారు మీరు నంద్యాలలో చేసిన ఎన్నికల ప్రచారాన్ని ఇప్పటికీ ఇక్కడ ప్రజలు మర్చిపోలేకపోతున్నారు.మీరు నంద్యాలలో ముందస్తు ఎన్నికల వేడుకలాగా మీ సినిమా ప్రీ రిలీజ్ వేడుక చేస్తారని మేము ఆశిస్తున్నాము.
నంద్యాలలో మీ సెంటిమెంట్ మాకు చాలా బాగా పనిచేసింది.మీ సెంటిమెంట్ ఇప్పుడు మా సెంటిమెంట్ అల్లు అర్జున్ గారు.మీ పుష్ప 2 (Pushpa2)సినిమా పాన్ ఇండియా స్థాయిలో ఎంతో మంచి సక్సెస్ కావాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను అంటూ ఈమె పోస్ట్ చేశారు.
ఈ విధంగా అల్లు అర్జున్ సినిమాని ఉద్దేశించి శబరి(Sabari) చేసిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అయింది.అయితే ఆమె వెంటనే ఈ పోస్ట్ డిలీట్ చేసిన అప్పటికే ఈ ట్వీట్ వైరల్ అవుతుంది.ఇకపోతే అసెంబ్లీ ఎన్నికల సమయంలో అల్లు అర్జున్ నంద్యాలకు (Nandyala )వెళ్లడంతో పెద్ద ఎత్తున వివాదంగా చెలరేగింది ఇలా తన ఫ్రెండ్ శిల్పా రవికి మద్దతు తెలిపినప్పటికీ ఆయన ఓడిపోవడంతో ఈమె ఆ విషయాన్ని గుర్తు చేస్తూ కౌంటర్ గా ఈ పోస్ట్ చేశారని అర్థమవుతుంది.