సుకుమార్(Sukumar)దర్శకత్వంలో అల్లు అర్జున్ (Allu Arjun) రష్మిక (Rashmika) హీరో హీరోయిన్లుగా నటించిన తాజా చిత్రం పుష్ప 2 (Pushpa 2) .ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో డిసెంబర్ 5వ తేదీ విడుదలకు సిద్ధమవుతోంది.
ఈ సినిమా విడుదలకు సమయం తక్కువగా ఉన్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను కూడా నిర్వహిస్తున్నారు.ఇలా ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా చిత్ర బృందం వివిధ నగరాలలో పర్యటిస్తూ ప్రెస్ మీట్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.
ఇక ఈ సినిమా నుంచి విడుదల చేసిన అప్డేట్స్ సినిమాపై భారీ స్థాయిలో అంచనాలను కూడా పెంచేస్తున్నాయి.
ఇక ఇటీవల అల్లు అర్జున్ శ్రీ లీల (Allu Arjun Sri Leela)కాంబినేషన్లో విడుదల చేసిన కిసిక్ స్పెషల్ సాంగ్ సోషల్ మీడియాని ఓ ఊపు ఊపేస్తోంది.అయితే తాజాగా మరొక పాటను కూడా విడుదల చేశారు.రష్మిక అల్లు అర్జున్ మధ్య కొనసాగే ఫీలింగ్స్ అనే సాంగ్ సోషల్ మీడియాలో ప్రస్తుతం ఫ్రెండ్ అవుతున్న సంగతి తెలిసిందే.
ఇక ఈ పాటలో అల్లు అర్జున్ రష్మిక విభిన్నమైన స్టెప్పులతో అదిరిపోయే డాన్స్ చేశారు.ఇలా ఈ పాటకు సోషల్ మీడియాలో వస్తున్న ఆదరణ చూసి రష్మిక సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ పోస్ట్ చేశారు.
ఫీలింగ్స్ అనే పాట ఇంత అద్భుతంగా రావడానికి అల్లు అర్జున్, సుకుమార్(Allu Arjun , Sukumar) కారణం.అన్ని భాషల అభిమానులను అలరించాలనే ఉద్దేశంతో డిజైన్ చేసింది.వారిద్దరు పాటపై పెట్టుకున్న నమ్మకానికి నా వంతు సహకారం చేశాను.వారిద్దరూ ఈ పాటను నమ్మినట్టే నేను కూడా ఈ పాటను బాగా నమ్మానని థియేటర్లో ఈ పాట మిమ్మల్ని మరింత అలరిస్తుందని నమ్ముతున్నాను అంటూ రష్మిక సోషల్ మీడియా వేదికగా చేసిన ఈ పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతుంది.
ఇక ఈ సినిమా ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్ కూడా ఓపెన్ అయ్యాయి ఏపీలో మినహా మిగిలిన అన్ని రాష్ట్రాలలో కూడా బుకింగ్స్ ఓపెన్ కావడంతో భారీ స్థాయిలోనే ఆదరణ లభిస్తుంది.