జనసేన అధినేత పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) ప్రస్తుతం ఏపీ మంత్రివర్గంలో కీలకంగా వ్యవహరిస్తున్నారు.ఉపముఖ్యమంత్రి హోదాలో ఆయన రాష్ట్రవ్యాప్తంగా పర్యటిస్తూ అనేక కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు.
ఏపీ కూటమి ప్రభుత్వంలో జనసేనకు( Janasena ) అత్యధిక ప్రాధాన్యం ఇస్తూ ఉండడం, ఈ విషయంలో ఏపీ సీఎం చంద్రబాబు( CM Chandrababu ) సానుకూలంగా ఉండడంతో, పవన్ గ్రాఫ్ రోజు రోజుకు పెరుగుతోంది.ఇక పవన్ విషయంలో కేంద్ర బీజేపీ పెద్దలు సానుకూలంగా ఉండడం, జాతీయ రాజకీయాల్లో పవన్ సేవలను ఉపయోగించుకుంటే బిజెపికి బాగా కలిసి వచ్చే అవకాశం ఉందని భావిస్తున్న నేపథ్యంలో, పవన్ కు కేంద్రమంత్రి( Central Minister ) పదవి ఇవ్వాలనే ఆలోచనలో బిజెపి పెద్దలు ఉన్నట్లు సమాచారం.
ప్రస్తుతం ఏపీ మంత్రి వర్గంలోకి పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబును తీసుకుంటున్నారు.

అయితే ఏపీ క్యాబినెట్ లో పవన్ కళ్యాణ్ ఉండగా, ఆయన సోదరుడిని తీసుకోవడం రాజకీయంగా ఇబ్బందికరమే అవుతుంది .అయితే ఈ విషయం పవన్ కు తెలియనిది కాదు .కేంద్రమంత్రిగా అవకాశం దక్కబోతోందనే సంకేతాలతోనే చంద్రబాబు సైతం నాగబాబుకు( Nagababu ) అవకాశం ఇస్తున్నట్లు అర్థమవుతుంది. పవన్ కళ్యాణ్ ఇటీవల కాలంలో జాతీయ అంశాలపై ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారు .ముఖ్యంగా హిందుత్వం విషయంలో పవన్ దూకుడుగా వ్యవహరిస్తున్నారు. హిందుత్వవాదిగా దేశవ్యాప్తంగా పవన్ ఇమేజ్ పెరుగుతోంది.దీంతో స్థానికంగా కంటే ఢిల్లీలో పవన్ ఉంటేనే మంచిదని బిజెపి హై కమాండ్ పెద్దలు భావిస్తున్నారట.

ఈ మేరకు పవన్ తోనూ ఈ విషయంపై చర్చించినట్లు సమాచారం.గతంలోనే పవన్ ను ఎంపీగా పోటీ చేయాలని అమిత్ షా సూచించారు.కానీ పవన్ ఏపీ రాజకీయాలపైనే ఆసక్తి చూపించడంతో పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపొందారు.ప్రస్తుతం ఏపీ డిప్యూటీ సీఎంగా పవన్ కొనసాగుతున్నారు.జాతీయ స్థాయి లో పవన్ ఇమేజ్ పెరగడం తో తమిళనాడు, ఢిల్లీ తో పాటు , ఇతర రాష్ట్రాల ఎన్నికల్లోనూ పవన్ ను ఉపయోగించుకునే ఆలోచనతో ఉన్న బిజెపి పెద్దలు పవన్ ను కేంద్ర క్యాబినెట్ లోకి తీసుకోవాలని నిర్ణయించుకున్నారట.త్వరలోనే పవన్ కు కేంద్ర మంత్రి పదవి వరించే అవకాశం కనిపిస్తోంది.
అందుకే ముందుగానే పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబు కు ఏపీ మంత్రి వర్గంలో బెర్త్ కన్ఫామ్ అయ్యిందట.