సాధారణంగా ఏ స్టార్ హీరోకైనా ఒక సినిమా హిట్టైతే ఆ ప్రభావం తర్వాత సినిమాలపై పడుతుంది.సింహాద్రి సినిమా తర్వాత ఎన్టీఆర్ నటించిన పలు సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో ఫలితాలను సొంతం చేసుకోలేదు.
బాహుబలి తర్వాత ప్రభాస్ నటించిన పలు సినిమాలు సైతం బాక్సాఫీస్ వద్ద సక్సెస్ సాధించలేదు.పుష్ప,( Pushpa ) పుష్ప2( Pushpa 2 ) సినిమాలు సైతం ఇదే విధంగా బన్నీ కెరీర్ పై ఇదే విధంగా ప్రభావం చూపే ఛాన్స్ ఉంది.
బన్నీ ( Bunny ) తర్వాత సినిమాలతో బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టించాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.బన్నీ త్రివిక్రమ్ కాంబో మూవీపై సైతం భారీ స్థాయిలో అంచనాలు నెలకొన్నాయి.
బన్నీ అంతకుమించి అనే రేంజ్ ఉన్న సినిమాలలో నటించాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.బన్నీ త్రివిక్రమ్ కాంబో మూవీ ఎలా ఉండబోతుందో చూడాల్సి ఉంది.

బన్నీ త్రివిక్రమ్( Trivikram ) కాంబో మూవీ మరికొన్ని నెలల్లో సెట్స్ పైకి వెళ్లనుంది.ఈ సినిమా స్క్రిప్ట్ కోసం త్రివిక్రమ్ ఎంతో కష్టపడుతున్నారని తెలుస్తోంది.అల్లు అర్జున్ త్రివిక్రమ్ కాంబో మూవీ మైథలాజికల్ టచ్ తో ఉండనుందని ఈ సినిమా బడ్జెట్ ఏకంగా 700 కోట్ల రూపాయలు అని వార్తలు వస్తున్నాయి.బన్నీపై పుష్ప ది రూల్ సినిమాతో మోయలేనంత భారం పెరిగింది.

పుష్ప ది రూల్( Pushpa The Rule ) సినిమాకు ఇప్పటికే ఏకంగా 440 కోట్ల రూపాయలకు పైగా షేర్ కలెక్షన్లు వచ్చాయని తెలుస్తోంది.మైత్రీ నిర్మాతలు ఈ సినిమా కలెక్షన్ల విషయంలో పూర్తిస్థాయిలో సంతృప్తితో ఉన్నారని సమాచారం అందుతోంది.బన్నీ కష్టానికి తగిన గుర్తింపు పుష్ప ది రూల్ తో దక్కిందని నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.పుష్ప ది రూల్ నార్త్ ఇండియాలో సాధిస్తున్న రికార్డులు ఇండస్ట్రీ వర్గాలను షాక్ కు గురి చేస్తున్నాయి.
మాస్ సినిమాను సరైన రీతిలో తెరకెక్కిస్తే ఏ స్థాయిలో సంచలనాలు క్రియేట్ అవుతాయో ఈ సినిమాతో ప్రూవ్ అయింది.