టాలీవుడ్ ఇండస్ట్రీలోని ప్రస్తుతం టాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్లలో థమన్( Thaman ) ముందువరసలో ఉన్నారు.థమన్ పారితోషికం ప్రస్తుతం 4 నుంచి 5 కోట్ల రూపాయల రేంజ్ లో ఉంది.
బాయ్స్ సినిమా ( Boys movie )షూటింగ్ అనుభవాలను థమన్ పంచుకోగా ఆ విషయాలు ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి.బాయ్స్ సినిమా సెట్స్ లో తాను చాలా అల్లరి చేశానని థమన్ తెలిపారు.
బాయ్స్ సినిమా షూటింగ్ సమయంలో తాను చాలా అల్లరి చేసేవాడినని థమన్ పేర్కొన్నారు.ఆ టైమ్ లో డైరెక్టర్ శంకర్( Director Shankar ) దగ్గర అరివళగన్ అసిస్టెంట్ గా పని చేసేవారని థమన్ వెల్లడించారు.
అరివళగన్ ను నా అల్లరి భరించలేక కాపలాగా పెట్టేవారని థమన్ పేర్కొన్నారు.శబ్దం మూవీ ప్రమోషన్స్ లో భాగంగా థమన్ ఈ విషయాలను చెప్పుకొచ్చారు.శబ్దం సినిమాలో ఆది పినిశెట్టి హీరోగా నటించారు.

మరోవైపు ఇండస్ట్రీలో వరుస ఆఫర్లు సొంతం చేసుకోవడం తమన్ కు మాత్రమే సాధ్యమవుతుంది.అఖండ సినిమా( Akhanda movie ) నుంచి బాలయ్య నటించిన ప్రతి సినిమాకు తమన్ మ్యూజిక్ డైరెక్టర్గా వ్యవహరించారు.నందమూరి అభిమానులు తమన్ ను నందమూరి తమన్ అని పిలుస్తారు అంటే తమన్ అంటే ఎంత అభిమానమో సులువుగా అర్థమవుతుంది.
మరికొన్ని సంవత్సరాలపాటు ఇండస్ట్రీలో తమన్ కు తిరుగులేదని చెప్పడంలో ఏమాత్రం సందేహం అవసరం లేదు.కిక్ సినిమాతో మంచి గుర్తింపు సంపాదించుకున్న తమన్ కెరీర్ పరంగా విజయాలను ఖాతాలో వేసుకుంటున్నారు.

చిన్నప్పటినుంచి మ్యూజిక్ అంటే ఇష్టం ఉన్న తమన్ తెలుగులో దాదాపుగా అందరూ స్టార్ హీరోలతో కలిసి వర్క్ చేశారని చెప్పాలి.బిజిఎం విషయంలో సైతం తమన్ అదరగొడుతుండటం సోషల్ మీడియా వేదికగా సంచలనం అవుతుంది.తను మ్యూజిక్ అందించిన సినిమాలకు అద్భుతంగా ప్రమోషన్స్ చేస్తూ అభిమానులతో పాటు ప్రేక్షకులను సైతం మెప్పించే విషయంలో తమన్ నూటికి నూరు శాతం సక్సెస్ అవుతున్నారు