రాజమౌళి( Rajamouli ).భారతీయ సినీ పరిశ్రమలో గొప్ప స్థాయికి ఎదిగిన దర్శకుడు.
ఆయన రూపొందించిన బాహుబలి 1, 2, ఆర్ఆర్ఆర్ చిత్రాలు ప్రపంచవ్యాప్తంగా ఘనవిజయం సాధించాయి.రాజమౌళి పేరు భారతీయ సినిమాను ముఖ్యంగా తెలుగు సినిమాలను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన దర్శకుల జాబితాలో అగ్రస్థానంలో ఉంది.
ప్రస్తుతం ఆయన సూపర్ స్టార్ మహేశ్ బాబుతో కలిసి ఓ భారీ బడ్జెట్ అడ్వెంచర్ యాక్షన్ థ్రిల్లర్ సినిమాను రూపొందిస్తున్నారు.అయితే, తాజాగా రాజమౌళి ఓ వివాదంలో చిక్కుకున్నట్లు తెలుస్తోంది.
దర్శకుడు రాజమౌళిపై ఆయన క్లోజ్ ఫ్రెండ్ యు.శ్రీనివాసరావు ( U.Srinivasa Rao )తీవ్ర ఆరోపణలు చేశారు.తన జీవితాన్ని రాజమౌళి నాశనం చేశారని, తాను ఆత్మహత్య చేసుకోవాలనే స్థితికి వచ్చానని ఆయన ఓ వీడియో ద్వారా వెల్లడించారు.
ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ అవుతోంది.వీడియోలో శ్రీనివాసరావు మాట్లాడుతూ.తనకు, రాజమౌళికి 34 ఏళ్ల స్నేహం ఉందని తెలిపారు. తమ ఇద్దరికీ ఒకే అమ్మాయిపై ప్రేమ అని, అది ఆర్య 2 లాంటి ట్రయాంగిల్ లవ్ స్టోరీగా మారిందని చెప్పారు.
రాజమౌళి తనను అమ్మాయిని త్యాగం చేయాలని అడిగారని.మొదట అంగీకరించలేదని, అయితే చివరకు తానే వెనక్కి తగ్గానని తెలిపారు.
అంతేకాకుండా.రాజమౌళి తనను తీవ్రంగా వేధిస్తున్నారని ఆరోపించారు.తనకూ, రాజమౌళికీ ఓసారి గొడవ జరిగిందని, తాను తమ లవ్ స్టోరీ ఆధారంగా సినిమా తీయాలని అనుకోవడంతో రాజమౌళి తనపై కక్ష సాధించాడని పేర్కొన్నారు.తన వయస్సు 55 ఏళ్లు దాటిందని, ఒంటరిగానే జీవిస్తున్నానని, తన మరణానికి రాజమౌళినే కారణమని ఆరోపించారు.
తన ఆరోపణలపై ఆధారాలు లేవని శ్రీనివాసరావు తెలిపారు.కానీ, తాను చనిపోయిన తర్వాత తన కేసును సుమోటోగా తీసుకొని, రాజమౌళికి లై డిటెక్టర్ టెస్ట్ చేయించాలని డిమాండ్ చేశారు.
అప్పుడు నిజాలు బయటకు వస్తాయని చెప్పారు.ఈ ఆరోపణలపై రాజమౌళి ఇప్పటివరకు స్పందించలేదు.
దేశంలోని టాప్ డైరెక్టర్‌పై ఇలాంటి తీవ్రమైన విమర్శలు రావడం సంచలనంగా మారింది.ఈ వివాదం ఎలా పరిణమిస్తుందో చూడాలి.