ఎంత‌టి బాన పొట్టైనా ఆ ఐదు టిప్స్‌తో ఈజీగా క‌రిగించ‌వ‌చ్చు..తెలుసా?

బాన పొట్ట లేదా బెల్లీ ఫ్యాట్.స్త్రీ, పురుషులు అనే తేడా లేకుండా ఎందర్నో తీవ్రంగా వేధిస్తున్న సమస్య ఇది.

 Five Effective Tips To Lose Belly Fat! Five Effective Tips, Belly Fat, Fat, Late-TeluguStop.com

ఆహారపు అలవాట్లు, ఒకే చోట ఎక్కువ సేపు కూర్చోవడం, అధిక‌ ఒత్తిడి, వేళకు ఆహారం తీసుకోకపోవడం, వంశపారం పర్యం, జీర్ణ వ్యవస్థ పని తీరు మందగించడం, మద్యపానం ఇలా రక రకాల కారణాల వల్ల పొట్ట చుట్టూ కొవ్వు పేరుకు పోతుంది.దాంతో పెరిగిన పొట్టను కవర్ చేసుకోలేక.

అలాగే తగ్గించుకోనూ లేక ఎంతగానో సతమతం అయిపోతుంటారు.అయితే ఇకపై బాన పొట్ట టెన్షన్ మీకు అక్కర్లేదు.

ఎందుకంటే ఇప్పుడు చెప్ప‌బోయే ఐదు టిప్స్‌ను పాటిస్తే చాలా ఈజీగా పొట్ట చుట్టు పేరుకు పోయిన కొవ్వును క‌రిగించుకోవ‌చ్చు.మ‌రి ఇంకెందుకు ఆల‌స్యం ఆ టిప్స్ ఏంటో ఓ లుక్కేసేయండి.

ఉద‌యం లేవ‌గానే బ్రెష్ చేసుకుని రెండు గ్లాసుల గోరు వెచ్చ‌ని నీటిని సేవించాలి.త‌ద్వారా శ‌రీరంలోని ట్యాక్సిన్లు బ‌య‌ట‌కు వెళ్లి పోతాయి.

మ‌రియు రాత్రి నిద్రించే ముందు కూడా ఒక గ్లాస్ గోరు వెచ్చ‌ని నీటిని తీసుకుంటే.జీర్ణ వ్య‌వ‌స్థ ప‌ని తీరు చురుగ్గా మారుతుంది.

ఉద‌యం టీ, కాఫీలు తాగే స‌మ‌యంలో ఒక గ్లాస్ వేడి నీటితో రెండు టేబుల్ స్పూన్ల నిమ్మ ర‌సం క‌లిపి తీసుకోవాలి.ఈ డ్రింక్ పొట్ట చుట్టు ఏర్ప‌డిన కొవ్వును క్ర‌మ క్ర‌మంగా క‌రిగించేస్తుంది.

Telugu Belly Fat, Effective Tips, Tips, Latest-Latest News - Telugu

అలాగే మ‌ధ్యాహ్నం భోజ‌నం చేయ‌డానికి గంట ముందు ఒక గ్లాస్ గోరు వెచ్చ‌ని నీటితో ఒక స్పూన్ అవిసె గింజ‌ల పొడిని క‌లిపి సేవించాలి.ఈ డ్రింక్ శ‌రీరంలో పేరుకున్న కొవ్వును త‌గ్గించ‌డంతో పాటు అధిక ఆక‌లిని కంట్రోల్ చేస్తుంది.దాంతో మీరు భోజ‌నాన్ని త‌క్కువ‌గా తీసుకుంటారు.

చాలా మంది చేసే పొర‌పాటు ప‌గ‌టి పూట నిద్ర పోవ‌డం.బాన పొట్ట‌కు ప్ర‌ధాన కార‌ణాల్లో ప‌గ‌టి పూట నిద్ర ఒక‌టి.అందుకే ప‌గ‌లు ఎట్టి ప‌రిస్థితుల్లో నిద్ర పోకండి.

బాన పొట్ట త‌గ్గాలీ అంటే వ్యాయామాలు ఎంతో అవ‌స‌రం.గంట‌ల‌కు గంట‌లు చేయ‌లేక‌పోయినా రోజుకు క‌నీసం ముప్పై నిమిషాల పాటు ర‌న్నింగ్‌, స్కిప్పింగ్, వాకింగ్ వంటివి చేయాలి.

అదే స‌మ‌యంలో మిరియాలు, వెల్లుల్లి, పండ్ల ర‌సాలు, ఆకుకూర‌లు, కొబ్బ‌రి నీళ్లు, ఓట్స్‌ వంటివి డైట్‌లో చేర్చుకోండి.ఇప్పుడు చెప్పుకున్న ఐదు చిట్కాలు పాటిస్తే ఎంత‌టి బాన పొట్టైనా ఇట్టే త‌గ్గుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube