చరణ్ కియరా జోడికి కలసి రాలేదా...అప్పుడు అలా... ఇప్పుడు ఇలా?

టాలీవుడ్ మెగా హీరో రామ్ చరణ్( Mega hero Ram Charan ) బాలీవుడ్ హీరోయిన్ కియారా అద్వానీ ( Kiara Advani )కలిసి నటించిన తాజా చిత్రం గేమ్ చేంజర్.శంకర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను దిల్ రాజు నిర్మించిన విషయం తెలిసిందే.

 Failure Pair Ram Charan And Kiara Advani, Ram Charan, Kiara Advani, Tollywood, M-TeluguStop.com

ఈ సినిమా విడుదల అయ్యి ఊహించిన విధంగా మిక్స్డ్ టాక్ ని,నెగటివ్ టాక్ ని తెచ్చుకుంది.ఈ సినిమాపై సోషల్ మీడియాలో దారుణంగా ట్రోలింగ్స్ నెగెటివిటీ కూడా ప్రచారం అయిన విషయం తెలిసిందే.

అయితే ఈ సినిమా కంటే ముందు కియారా అద్వానీ అలాగే రామ్ చరణ్ లు వినయ విధేయ రామ సినిమాలో నటించిన విషయం తెలిసిందే.బోయ‌పాటి శ్రీను ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ సినిమా కూడా భారీ అంచ‌నాల మ‌ధ్య రిలీజ్ అయినా ఫ‌లితం తేడా కొట్టేసింది.

Telugu Failurepair, Kiara Advani, Flap, Ram Charan, Tollywood-Movie

చ‌ర‌ణ్‌, కియారా క‌లిసి న‌టించిన రెండు సినిమాలు కూడా డిజాస్ట‌ర్ల‌గానే న‌మోదయ్యాయి.దీంతో ఇద్ద‌రి కాంబినేషన్ ని ఇక‌పై రిపీట్ చేయ‌క‌పోవ‌డ‌మే మంచిద‌నే విమ‌ర్శ వ్య‌క్త‌మ‌వుతోంది.వాస్త‌వానికి శంక‌ర్ గేమ్ ఛేంజ‌ర్ సినిమాకి ( Game changer )ఎంపిక చేసిన‌ప్పుడే ఇదోక‌ బ్యాడ్ ఇండికేష‌న్ గా నెట్టింట వైరల్ అయింది.విన‌య విధేయ రామ‌( Vinaya Vidheya Rama ) సినిమాతో ప్లాప్ కాంబినేష‌న్ అనే ముద్ర ప‌డింది.

అయినా శంక‌ర్ ప‌ట్టుబ‌ట్టి మ‌రీ కియారాని ఎంపిక చేసాడు.దీంతో మెగా అభిమానుల నుంచి కొంత అసంతృప్తి వ్య‌క్త‌మైంది.అయినా శంక‌ర్ వాట‌న్నింటి లైట్ తీసుకుని ముందు కెళ్లారు.

Telugu Failurepair, Kiara Advani, Flap, Ram Charan, Tollywood-Movie

క‌ట్ చేస్తే ఫ‌లితం తారు మారైంది.ఇక ప్లాప్ కి క‌ర్ణుడి చావు త‌ర‌హా కార‌ణాలెన్నో తెర‌పైకి వ‌స్తున్నాయి.అయినా ఇదంతా గ‌తం.

గ‌తాన్ని త‌వ్వినా ఎలాంటి ఫ‌లితం ఉండ‌దు.కానీ అనుభ‌వం నుంచి ఏం నేర్చుకున్నాం అన్న‌ది ముఖ్య‌మైంది.

మ‌రి ఈ ప్లాప్ శంక‌ర్ లో ఎలాంటి ప‌రివ‌ర్త‌న తీసుకొస్తుందో చూడాలి.అయితే హీరోయిన్ కియారా అద్వానీ తెలుగులో మహేష్ బాబు హీరోగా నటించిన భరత్ అనే నేను సినిమాలో హీరోయిన్గా నటించిన విషయం తెలిసిందే.

ఈ సినిమా విడుదల అయ్యి బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube