సోషల్ మీడియాలో పాకిస్థాన్ ఆర్మీపై( Pakistan Army ) భారీ ఎత్తున సంచలన ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.పాకిస్థాన్‌కు చెందిన కొంతమంది యూట్యూబర్లు గతంలో భారత దేశానికి మద్దతుగా వీడియోలు పెట్టారు.
ఇప్పుడు వాళ్లు కనిపించకుండా పోయారు.పాకిస్థాన్ ఆర్మీ వాళ్లను చంపేసిందని కొందరు అంటున్నారు.
ఎందుకంటే, ఆ యూట్యూబర్లు సడన్‌గా వీడియోలు పెట్టడం ఆపేశారు.
సుమారు 12 మంది యూట్యూబర్లు కనిపించకుండా పోయారని సమాచారం.
అందులో బాగా పాపులర్ అయిన సనా అంజద్, షోయబ్ చౌదరి ( Sana Anjad, Shoaib Chaudhary )కూడా ఉన్నారు.వీళ్లిద్దరూ రోడ్లపైకి వెళ్లి జనాలను ఇంటర్వ్యూలు చేయడం, ప్రజల రియాక్షన్స్ వీడియోలు తీయడంలో ఫేమస్.
షోయబ్ చౌదరి ‘రియల్ ఎంటర్‌టైన్‌మెంట్’ అనే ఛానెల్ ద్వారా, సనా అంజద్ తన పేరుతోనే ఛానెల్ ద్వారా పాకిస్థాన్‌లోని కరెంట్ అఫైర్స్, ప్రజల అభిప్రాయాలను వీడియోలు చేసేవాళ్లు.ఇండియా గురించి కూడా చాలా వీడియోలు పెట్టేవాళ్లు.
ఇండియన్ వ్యూయర్స్ ( Indian viewers )వీళ్ల వీడియోలను తెగ చూసేవాళ్లు.
దాదాపు 19 రోజులుగా వీళ్లు కొత్త వీడియోలు పెట్టడం లేదని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.పాకిస్థాన్ ఆర్మీ వాళ్లను ఉరేసి చంపేసిందని కొందరు అంటున్నారు.దీంతో ప్రపంచవ్యాప్తంగా చాలా మంది ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
సనా అంజద్ “మోదీ సదా షేర్ హై” ( Modi Sada Share High )(మోదీ ఎప్పటికీ సింహమే) అని ఒక వీడియో పెట్టింది.ఈ వీడియో బాగా వైరల్ అయింది.
ఆర్టికల్ 370 రద్దు చేసిన తర్వాత మోదీ జమ్మూ కశ్మీర్ వెళ్లినప్పుడు తీసిన వీడియో అది.పాకిస్థాన్‌లోని సమస్యలను, ఇండియాలోని మంచి విషయాలను చూపిస్తూ వీళ్లు వీడియోలు చేయడం వల్లే ఇప్పుడు ఈ కష్టాలు వచ్చాయని చాలా మంది అనుకుంటున్నారు.
కొందరు మాత్రం ఇంకోలా అంటున్నారు.ఇండియన్ వ్యూయర్స్ ఎక్కువ మంది చూస్తే డబ్బులు బాగా వస్తాయి కదా.అందుకే వీళ్లు కావాలనే పాకిస్థాన్‌ను తక్కువ చేసి, ఇండియాను పొగుడుతూ వీడియోలు పెట్టారని అంటున్నారు.పాకిస్థాన్‌లో రాజకీయాలు సరిగ్గా లేవని, అవినీతి ఎక్కువైందని, ఉద్యోగాలు లేవని, పేదరికం ఉందని ఇలాంటి వీడియోలు చేసి ఇండియాలో బాగా పాపులర్ అయ్యారు.
సనా, షోయబ్ సడన్‌గా కనిపించకుండా పోవడంతో పాకిస్థాన్‌లోనే కాదు, ఇండియాలో కూడా చాలా మంది భయపడుతున్నారు.అయితే, వాళ్లను చంపేశారని వస్తున్న వార్తలకు మాత్రం ఎలాంటి ఆధారాలు లేవు.
ఈ వార్తలను మేం ధృవీకరించడం లేదు.