నేటి కాలంలో ఏదో ఒక సాకు చెప్పి రెగ్యులర్‌గా మద్యం తాగేవారు కొందరు ఉంటే.వీకెండ్లో తాగే వారు మరి కొందరు.
వాస్తవానికి ప్రపంచంలో ఏ అమ్మకాలు ఎలా ఉన్నా.మద్యం అమ్మకాలు మాత్రం ఎప్పుడూ మంచి జోరుగా సాగుతుంటాయి.
ఆరోగ్యానికి మద్యం మంచిది కాదని తెలిసినా.పట్టించుకునే నాధుడే కరువయ్యాడు.
మద్యం సేవించడం వల్ల మొదట శరీరంలో అతి ముఖ్యమైన అవయవాల్లో ఒకటైన లివర్ (కాలేయం) తీవ్రంగా దెబ్బ తింటుంది.
అయినప్పటికీ, మద్యం అలవాటును మాత్రం మానుకోరు.
అయితే మద్యం అలవాటును మానుకోలేని వారు ప్రతి రోజు ఒకటి లేదా రెండు కప్పులబ్లాక్ కాఫీ తాగితే మంచిదంటున్నారు ఆరోగ్య నిపుణులు.సాధారణ కాఫీ కంటే బ్లాక్ కాఫీ తాగడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది.
అందులోనూ మద్యం తాగేవారు బ్లాక్ కాఫీనిషుగర్లేకుండా తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.ఎందుకూ అంటే. లివర్‌ను ఆరోగ్యంగా ఉంచడంలో బ్లాక్ కాఫీ అద్భుతంగా సహాయపడుతుంది.

బ్లాక్ కాఫీలో ఉండే యాంటీఆక్సిడెంట్స్ మరియు ఇతర ప్రత్యేక గుణాలు.సిర్రోసిస్ అనే లివర్ వ్యాధి, లివర్ క్యాన్సర్, లివర్ డ్యామేజ్ వంటి జబ్బుల దరిదాపుల్లోకి రాకుండా చేస్తాయి.అదే సమయంలో కాలేయ ఆరోగ్యాన్ని మెరుగు పరుస్తాయి.
కాబట్టి, మద్యం తాగే వారు ఉదయాన్నే ఏవేవో పానియాలు కాకుండా.ఒక కప్పు బ్లాక్ కాఫీ అది కూడా షుగర్ లేకుండా తీసుకుంటే.
పాడైపోతున్న ఈ లివర్‌ను కాపాడుకోవచ్చు.

ఇక మద్యం సేవించినా తమ లివర్ ఆరోగ్యంగా ఉండాలి అని కోరుకునే వారు.బ్లాక్ కాఫీతో పాటుగా గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్, ఆపిల్స్, బెర్రీస్, ద్రాక్ష, వెల్లుల్లి, బీట్ రూట్, క్యారెట్, నట్స్, చేపలు, తాజా కూరగాయలు వంటివి తీసుకుంటూ ఉండాలి.అదే సమయంలో ఫ్యాటీ ఫుడ్స్‌కు దూరంగా ఉండాలి.
లేదంటే లివర్ ఆరోగ్యం మరింత క్షీణిస్తుంది.