ఈ ఒక్కటి పాటిస్తే 60 లోనూ మీ జుట్టు నల్లగానే మెరుస్తుంది.. తెలుసా?

Follow This Wonderful Remedy For Black Hair Even 60s!, Black Hair, Home Remedy, Latest News, Hair Care, Hair Care Tips, White Hair, Stop White Hair, Thick Hair

40 ఏళ్లు వచ్చాయంటే చాలు జుట్టు మెల్లమెల్లగా తెల్లబడటం స్టార్ట్ అవుతుంది.తెల్ల జుట్టు రాగానే తెగ హైరానా పడిపోతుంటారు.

 Follow This Wonderful Remedy For Black Hair Even 60s!, Black Hair, Home Remedy,-TeluguStop.com

అప్పుడే ముసలి వాళ్ళం అయిపోయామా అని లోలోనా మదన పడుతూ ఉంటారు.ఈ క్రమంలోనే తెల్ల జుట్టు( White Hair )ను కవర్ చేసుకునేందుకు తరచూ కలర్ వేసుకుంటూ ఉంటారు.

కానీ ఇప్పుడు చెప్పబోయే సింపుల్ రెమెడీని కనుక పాటిస్తే 60 లోనూ మీ జుట్టు నల్లగానే మెరుస్తుంది.కలర్ వేసుకోవాల్సిన పరిస్థితే రాదు.

మరి ఇంతకీ తెల్ల జుట్టుకు చెక్ పెట్టే ఆ రెమెడీ ఏంటో తెలుసుకుందాం ప‌దండి.

ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకుని అందులో మూడు టేబుల్ స్పూన్లు కలోంజి సీడ్స్( Kalonji Seeds ) వేసి వేయించుకోవాలి.రెండు నిమిషాల పాటు వేపిన తర్వాత వాటిని మిక్సీ జార్ లో వేసి మెత్తని పౌడర్ మాదిరి గ్రైండ్ చేసుకోవాలి.ఇప్పుడు ఈ కలోంజి సీడ్స్ పౌడర్ లో రెండు టేబుల్ స్పూన్లు కాఫీ పౌడర్, నాలుగు నుంచి ఐదు టేబుల్ స్పూన్లు ఆవనూనె వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి.

ఆ త‌ర్వాత ఈ మిశ్రమాన్ని స్కాల్ప్ తో పాటు జుట్టు మొత్తానికి పట్టించి షవర్ క్యాప్ ధరించాలి.గంట లేదా గంటన్నర అనంతరం మైల్డ్ షాంపూ ను ఉపయోగించి శుభ్రంగా హెయిర్ వాష్ చేసుకోవాలి.

వారానికి కేవలం ఒక్కసారి ఈ సింపుల్ రెమెడీని కనుక పాటిస్తే తెల్ల జుట్టు అన్న మాటే అనరు.వయసు పైబడిన సరే మీ కురులు నల్లగా నిగనిగలాడుతూ మెరుస్తాయి.

కాబట్టి తెల్ల జుట్టుకు దూరంగా ఉండాలి అనుకుంటున్న‌ వారు తప్పకుండా ఈ సింపుల్ అండ్ వండర్ ఫుల్ హోమ్ రెమెడీని పాటించండి.పైగా ఆవనూనె వల్ల జుట్టు కుదుళ్లు బలోపేతం అవుతాయి.హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది.మరియు చుండ్రు సమస్య( Dandruff ) ఉన్న సరే క్రమంగా దూరం అవుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube