1.చంద్రబాబు బ్రాహ్మణి పై పోసాని విమర్శలు
ఇప్పటికైనా చంద్రబాబు చేసిన తప్పును ఒప్పుకోవాలని బయటకు వచ్చేటప్పుడు నిజాయితీగా వస్తే మాకు అభ్యంతరం లేదని వైసిపి నాయకుడు పోసాని కృష్ణమురళి అన్నారు.నారా బ్రాహ్మణి మాటలు వింటే జడ్జి మీద కూడా కేసులు పెట్టాలేమో అని కౌంటర్ ఇచ్చారు.
2.మహిళ రిజర్వేషన్ బిల్లు ప్రవేశపెట్టిన కేంద్రం
చట్టసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్లు కల్పించే మహిళా రిజర్వేషన్ బిల్లు లోక్ సభలో కేంద్ర న్యాయ శాఖ మంత్రి అర్జున్ రావు మెగ్వాల్ దిగువ సభలో ప్రవేశపెట్టారు.
3.కేంద్ర క్యాబినెట్ భేటీ
ప్రధాని నరేంద్ర మోది అధ్యక్షతన సాయంత్రం 6:30 గంటలకు కేంద్ర క్యాబినెట్ ప్రత్యేక సమావేశం జరగనుంది.
4.అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు
థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు చేయాలని తెలంగాణ సీఎం కేసీఆర్ ను కోరానని ఎంఐఎం అధినేత ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ అన్నారు.
5.మంత్రి బొత్స కామెంట్స్
జైల్లో చంద్రబాబు భద్రతకు పూర్తి బాధ్యత ప్రభుత్వందేనని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు.
6.ఏపీ వ్యాప్తంగా టిడిపి నిరసనలు
టిడిపి అధినేత చంద్రబాబు అరెస్టుకు నిరసనగా ఏపీ వ్యాప్తంగా ఎక్కడికక్కడ టిడిపి నేతలు నిరసన కార్యక్రమాలు చేపట్టగా , పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు.
7.గృహ నిర్బంధాలపై అచ్చెన్న కామెంట్స్
ఏం తప్పు చేశారని టిడిపి నేతలపై గృహ నిర్బంధాలు విధిస్తున్నారని టిడిపి ఏపీ అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్న నాయుడు ప్రశ్నించారు.
8.చంద్రబాబు క్వాష్ పిటిషన్ పై విచారణ ప్రారంభం
టిడిపి అధినేత చంద్రబాబు స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో వేసిన క్వాష్ పిటిషన్ పై హైకోర్టులో విచారణ ప్రారంభమైంది.
9.మహిళా రిజర్వేషన్ పై కవిత కామెంట్
మహిళా రిజర్వేషన్ బిల్లు ను ప్రవేశ పెడుతూ కేంద్రం తీసుకున్న నిర్ణయం పై బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పందించారు.కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయంలో బిఆర్ఎస్ కృషి ఉందని ఆమె అన్నారు.
9.తిరుమల బ్రహ్మోత్సవాలు
తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి .ఉత్సవాల్లో భాగంగా ఈరోజు చిన్న శేష వాహనంపై శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామి విహరించారు.
10.టిడిపి నేతల మౌన దీక్ష
ఢిల్లీలోని రాజ్ గాడ్ వద్ద టీడీపీ నేతలు మహాత్మా గాంధీకి నివాళులర్పించారు.పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తో పాటు , టిడిపి ఎంపీలు మాజీ ఎంపీలు అంజలి ఘటించారు.ఈ సందర్భంగా చంద్రబాబు అరెస్టుకు నిరసనగా నల్లబ్యాడ్జీలు ధరించి మౌనదీక్ష చేపట్టారు.
11.నటుడు విజయ్ ఆంటోనీ కుమార్తె ఆత్మహత్య
బిచ్చగాడు సేమ్ విజయ్ ఆంటోని ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది ఆయన పెద్ద కుమార్తె ఆత్మహత్య చేసుకున్నారు.చెన్నైలోని విజయ్ నివాసంలో మంగళవారం తెల్లవారుజామున 3 గంటలకు ఉరి వేసుకుని విజయ్ కుమార్తె ఆత్మహత్య చేసుకున్నారు.
12.టాటా వాహనాల ధరల పెంపు
టాటా మోటార్స్ మరోసారి తన కమర్షియల్ వాహన ధరలను పెంచనుంది.మూడు శాతం వరకు ధరలను పెంచనున్నట్లు సమాచారం.
13.దసరా ఉత్సవాలు
ఇంద్రకీలాద్రిపై అక్టోబర్ 15 నుంచి దసరా ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి.
14.వివేకా హత్య కేసు
మాజీ మంత్రి వివేకానంద రెడ్డి హత్య కేసులో నిందితుడు వైఎస్ భాస్కర్ రెడ్డి మద్యంతర బెయిల్ పిటిషన్ పై సిబిఐ కోర్టు విచారణ చేపట్టింది.ఈ బెయిల్ పిటిషన్ పై నిర్ణయాన్ని సిబిఐ కోర్టు రేపటికి వాయిదా వేసింది.
15.శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన జగన్
తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు సందర్భంగా స్వామివారికి ఏపీ సీఎం జగన్ పట్టు వస్త్రాలు సమర్పించారు.
16.చంద్రబాబు అరెస్టుపై లోక్ సభ లో మాట్లాడిన టిడిపి ఎంపీ
టిడిపి అధినేత చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేశారని లోక్ సభ లో ఆ పార్టీ ఎంపీ గల్లా జయదేవ్ అన్నారు.
17.గవర్నర్ ఆరోగ్యం పై జగన్ ఆరా
ఏపీ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ఆరోగ్య పరిస్థితి పై ఏపీ సీఎం జగన్ ఆరా తీశారు.గవర్నర్ ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు.
18.త్వరలో టిడిపిలో చేరుతా
టిడిపి అధినేత చంద్రబాబు బెయిల్ పై బయటకు రాగానే తాను తెలుగుదేశం పార్టీలో చేరుతానని వైసిపి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి అన్నారు.
19.ఏపీ సిఐడి పై పురందరేశ్వరి కామెంట్స్
స్కిల్ డెవలప్మెంట్ కేసులు సిఐడి తీరు అనుమానాలకు తావిచ్చేలా ఉందని బిజెపి ఏపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందరేశ్వరి అన్నారు.
20.వారికి చంద్రబాబు కృతజ్ఞతలు చెప్పమన్నారు
టిడిపి అధినేత చంద్రబాబును అక్రమంగా కేసుల్లో ఇరికించారని టిడిపి మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు .చంద్రబాబు ఏ తప్పు చేయలేదని అన్నారు.చంద్రబాబు అరెస్టును ఖండించిన జాతీయ నేతలకు ఆయన కృతజ్ఞతలు తెలుపమన్నారని యనమల అన్నారు.