మధ్యప్రదేశ్‌లోని సాగర్ ( Sagar in Madhya Pradesh )పట్టణంలో పెళ్లి వేడుకలలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది.ఇంకా పెళ్లి సందడి తగ్గకముందే పెళ్లికొడుకు హర్షిత్ చౌబే హఠాత్తుగా కన్నుమూశాడు.
నిన్న రాత్రి వరకు నవ్వుతూ, తుళ్లింతలతో కనిపించిన హర్షిత్, వెడ్డింగ్ సెలబ్రేషన్స్ ( Harshit, Wedding Celebrations )జరుగుతుండగానే తిరిగిరాని లోకాలకు వెళ్లిపోవడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.రాజ్‌ఘాట్ రోడ్డులోని ఓ ప్రైవేట్ హోటల్‌లో శుక్రవారం సాయంత్రం హర్షిత్, అతని వధువుల వివాహం అంగరంగ వైభవంగా జరిగింది.
బంధువులు, స్నేహితుల సమక్షంలో జరిగిన వరమాల కార్యక్రమంలో కొత్త జంట ఒకరికొకరు పూలమాలలు వేసుకున్నారు.ఇరు కుటుంబాల సభ్యులు డ్యాన్సులు చేస్తూ, పాటలు పాడుతూ ఆనందంలో మునిగిపోయారు.
జైసే నగర్ నుంచి పెళ్లి బృందం బారాత్ వేడుకకు హాజరైంది.అంతా సంతోషంగా గడిచింది.
అయితే, మరుసటి రోజు ఉదయం ఆ ఆనందాలన్నీ ఒక్కసారిగా ఆవిరైపోయాయి.“పాఢ్ పఖారీ” ( Padh Pakhari )అనే పెళ్లి తంతు జరుగుతుండగా హర్షిత్ ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు.ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు వెంటనే అతడిని ఆసుపత్రికి తరలించారు.అయితే, అప్పటికే హర్షిత్ మరణించాడని వైద్యులు నిర్ధారించారు.గుండెపోటు కారణంగానే హర్షిత్ మరణించి ఉంటాడని భావిస్తున్నారు.
సాగర్‌లో హర్షిత్ అందరికీ సుపరిచితుడు.గత కొన్నేళ్లుగా అక్కడే నివాసం ఉంటున్నాడు. గోపాల్‌గంజ్‌లో ( Gopalganj )అతడికి సొంతంగా మెడికల్ షాప్ ఉంది.
నలుగురు సంతానంలో హర్షిత్ చిన్నవాడు.అతనికి నలుగురు అక్కాచెల్లెళ్లు ఉన్నారు.
అందరితో ఎంతో ప్రేమగా ఉండే తమ తమ్ముడు తమ కళ్ల ముందే తిరిగిరాని లోకాలకు వెళ్ళిపోవడంతో అక్కాచెల్లెళ్లు గుండెలు పగిలేలా రోదిస్తున్నారు.
నిన్నటి వరకు నవ్వుతూ కనిపించిన తన వరుడు హఠాత్తుగా చనిపోవడంతో వధువు కన్నీటి పర్యంతమవుతోంది.పెళ్లి వేడుకల్లో ఎంతో సంతోషంగా, ఆరోగ్యంగా కనిపించిన హర్షిత్ ఇలా అర్ధాంతరంగా తనువు చాలిస్తాడని ఎవరూ ఊహించలేకపోయారు.ఈ ఊహించని విషాదంతో పెళ్లికి వచ్చిన స్నేహితులు, బంధువులు దిగ్భ్రాంతికి గురయ్యారు.
హర్షిత్ మరణించిన తర్వాత, అతని కుటుంబ సభ్యులు మృతదేహాన్ని స్వస్థలమైన జైసే నగర్‌కు తరలించి అంత్యక్రియలు నిర్వహించారు.ఈ విషాద ఘటన హర్షిత్‌ను తెలిసిన ప్రతి ఒక్కరినీ తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.
పెళ్లింట ఒక్కసారిగా నెలకొన్న విషాదం అందరినీ కలచివేస్తోంది.