మలబద్ధకం( Constipation ) అనేది చాలా మందిని ఇబ్బంది పెట్టే కామన్ సమస్య.అయితే మందులతో అవసరం లేకుండా సహజంగా మలబద్ధకం సమస్యను నివారించుకోవచ్చు.
అందుకు ఇప్పుడు చెప్పబోయే స్మూతీ( Smoothie ) ఎంతో ఉత్తమంగా సహాయపడుతుంది.అందుకోసం ముందుగా ఒక క్యారెట్ ను( Carrot ) ముక్కలుగా కట్ చేసుకుని బ్లెండర్ లో వేసి ఒక గ్లాస్ వాటర్ పోసి మెత్తగా గ్రైండ్ చేసి జ్యూస్ ను సపరేట్ చేసుకోవాలి.
ఆ తర్వాత మరోసారి బ్లెండర్ తీసుకుని అందులో అరకప్పు బొప్పాయి ముక్కలు,( Papaya ) అరకప్పు అరటి పండు ముక్కలు,( Banana ) ఒక గ్లాస్ క్యారెట్ జ్యూస్, రెండు టేబుల్ స్పూన్లు రోల్డ్ ఓట్స్ వేసి మెత్తగా బ్లెండ్ చేసుకోవాలి.దాంతో మన హెల్తీ అండ్ టేస్టీ క్యారెట్ బనానా పపాయ ఓట్స్ స్మూతీ అనేది రెడీ అవుతుంది.

ఈ స్మూతీని వారానికి రెండుసార్లు తీసుకుంటే మలబద్ధకం దెబ్బకు పరారవుతుంది.అరటి, బొప్పాయి, క్యారెట్ మరియు ఓట్స్ లో ఫైబర్ అనేది మెండుగా ఉంటుంది.ఈ ఫైబర్ కు తోడు బొప్పాయిలోని జీర్ణ ఎంజైమ్‌లు ప్రేగు కదలికలను నియంత్రించడంలో సహాయపడతాయి.మలబద్ధకాన్ని తరిమి కొడతాయి.అలాగే బొప్పాయి మరియు క్యారెట్ రెండింటిలోనూ విటమిన్ సి కంటెంట్ అధికంగా ఉంటుంది.ఇది మన శరీర రోగ నిరోధక వ్యవస్థను బలపరిచి ఇన్ఫెక్షన్లతో పోరాడటానికి సహాయపడుతుంది.

క్యారెట్, బొప్పాయి, అరటి లోని యాంటీ ఆక్సిడెంట్ల కలయిక కణాల నష్టం నుండి రక్షణను అందిస్తుంది.క్యారెట్ నుండి విటమిన్ ఎ మరియు బొప్పాయి నుండి విటమిన్ సి కొల్లాజెన్ ఉత్పత్తికి దోహదం చేస్తాయి.ఆరోగ్యకరమైన చర్మ ఆకృతిని మరియు రూపాన్ని ప్రోత్సహిస్తాయి.అంతేకాకుండా ఈ క్యారెట్ బనానా పపాయ ఓట్స్ స్మూతీ బరువు నియంత్రణలోనూ హెల్ప్ చేస్తుంది.ఈ జ్యూస్ కడుపును ఎక్కువ సమయం పాటు నిండుగా ఉంచుతుంది.ఆకలిని నియంత్రిస్తుంది అతిగా తినడాన్ని తగ్గిస్తుంది.
ఫలితంగా వెయిట్ లాస్ అవుతారు.