వైరల్ వీడియో: మహాకుంభమేళాలో ఫలించిన గర్ల్‌ఫ్రెండ్ ఐడియా..

ఉత్తరప్రదేశ్‌లోని( Uttar Pradesh ) ప్రయాగ్‌రాజ్‌లో మహాకుంభమేళా( Maha Kumbhmela ) వైభవంగా కొనసాగుతోంది.దేశం నలుమూలల నుంచి లక్షలాది మంది భక్తులు త్రివేణి సంగమంలో పుణ్యస్నానం చేసేందుకు తరలివస్తున్నారు.

 Man Credits Girlfriend For Maha Kumbh Neemtooth Sticks Business Success Details,-TeluguStop.com

ఈ మహాకుంభమేళా భక్తులకు ఆధ్యాత్మిక అనుభూతిని అందించడమే కాకుండా వ్యాపార వృద్ధికి కూడా దోహదపడుతోంది.పుణ్యక్షేత్రంలో టీ, ప్రసాదం, ఇతర వస్తువులు అమ్ముతూ ఎంతో మంది వ్యాపారులు సొమ్ము చేసుకుంటున్నారు.“ఒక్క మంచి ఐడియా జీవితాన్ని పూర్తిగా మార్చగలదు” అనే మాట ఈ ఘటనకు అక్షరాల నిజం.ఓ యువకుడు తన గర్ల్‌ఫ్రెండ్( Girlfriend ) ఇచ్చిన చిన్న ఐడియాతో మహాకుంభమేళాను తన ఆదాయ మార్గంగా మార్చుకున్నాడు.

Telugu Datun, Girlfriend, Girlfriend Idea, Maha Kumbh, Mahakumbh, Neemtooth, Utt

అతడు ఏ పెట్టుబడి లేకుండా వేపపుల్లలు( Neemtooth Sticks ) అమ్ముతూ వారం రోజుల వ్యవధిలోనే రూ.40,000 సంపాదించాడు.ఈ విషయాన్ని అతడు స్వయంగా చెప్పిన వీడియో సోషల్ మీడియాలో షేర్ చేయగా అది వైరల్‌గా మారింది.లక్షల సంఖ్యలో భక్తులు మహాకుంభమేళాకు వస్తుండటంతో అతడు కేవలం రూపాయి పెట్టుబడి లేకుండా వేపపుల్లలు విక్రయిస్తూ మంచి లాభాలను అందుకున్నాడు.

ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఈ వీడియోకు ఇప్పటివరకు లక్షల సంఖ్యలో వ్యూస్, వేల సంఖ్యలో లైక్‌లు వచ్చాయి.

Telugu Datun, Girlfriend, Girlfriend Idea, Maha Kumbh, Mahakumbh, Neemtooth, Utt

ఈ వీడియోను చూసిన నెటిజన్లు అతని ఐడియాను ప్రశంసిస్తున్నారు.ముఖ్యంగా అతని విజయం వెనుక అతని గర్ల్‌ఫ్రెండ్ ఇచ్చిన సలహా ఉందని తెలుసుకుని, ఆమెను ప్రశంసిస్తూ అనేక మంది కామెంట్లు చేస్తున్నారు.మహాకుంభమేళా భక్తులకు పుణ్యం సంపాదించే ప్రదేశంగా ఉంటే, వ్యాపారులకు తమ జీవితాలను మార్చుకునే అవకాశాన్ని ఇస్తోంది.

సాధారణమైన ఆలోచన, స్మార్ట్ వర్క్‌తోనే ఎంత పెద్ద మార్పు తీసుకురాగలమో ఈ యువకుడు మరోసారి నిరూపించాడు.ఇక మరోవైపు పూసలు అమ్ముకొనే మోనాలిసా( Monalisa ) గురించి ప్రత్యేకంగా చెప్పాలి.

ఆమె అందమైన తో తెగ పాపులర్ అయింది.అంతేకాదు ఈ విధంగా బాలీవుడ్ లో హీరోయిన్గా ఛాన్స్ కొట్టేసింది కూడా.

అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అయింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube