డెలివరీ( Delivery ) అనంతరం మహిళల్లో ఎంతో మంది ఎదుర్కొనే కామన్ సమస్య హెయిర్ ఫాల్.( Hair Fall ) ప్రసవం అనంతరం కొందరికి జుట్టు విపరీతంగా రాలిపోతుంటుంది.
కంటినిండా నిద్ర లేకపోవడం, ఈస్ట్రోజన్ లెవెల్స్ తగ్గడం, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి తదితర కారణాల వల్ల ఆ సమయంలో హెయిర్ ఫాల్ అనేది అధికంగా ఉంటుంది.ఈ సమస్య నుంచి బయట పడటం కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తుంటారు.
అయితే కొందరిలో ఎంత ప్రయత్నించినా జుట్టు రాలడం తగ్గదు.మీకు ఇలా జరుగుతుందా.? అయితే అస్సలు వర్రీ అవ్వకండి.
ఇప్పుడు చెప్పబోయే సూపర్ పవర్ ఫుల్ రెమెడీని కనుక పాటిస్తే ఎలాంటి హెయిర్ ఫాల్ అయిన దెబ్బకు కంట్రోల్ అవుతుంది.
మరి ఇంకెందుకు ఆలస్యం ఆ పవర్ ఫుల్ రెమెడీ ఏంటో ఓ చూపు చూసేయండి.ముందుగా ఒక బంగాళదుంపను( Potato ) తీసుకుని పీల్ తొలగించి వాటర్ తో శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.
అలాగే ఎనిమిది నుంచి పది వెల్లుల్లి రెబ్బలను తీసుకుని శుభ్రంగా పొట్టు తొలగించి పెట్టుకోవాలి.

ఇప్పుడు మిక్సీ జార్ లో కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంప ముక్కలు మరియు వెల్లుల్లి రెబ్బలు వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమం నుంచి స్టైనర్ సహాయంతో జ్యూస్ ను సపరేట్ చేసుకోవాలి.ఈ జ్యూస్ లో వన్ టేబుల్ స్పూన్ కొబ్బరి నూనె,( Coconut Oil ) రెండు టేబుల్ స్పూన్లు ఆముదం వేసి బాగా మిక్స్ చేసుకోవాలి.
తద్వారా ఓ మంచి సీరం సిద్ధమవుతుంది.ఈ సీరంను స్కాల్ప్ తో పాటు జుట్టు మొత్తానికి అప్లై చేసుకుని షవర్ క్యాప్ ధరించాలి.

గంట లేదా గంటన్నర అనంతరం మైల్డ్ షాంపూ ను ఉపయోగించి శుభ్రంగా తల స్నానం చేయాలి.వారానికి రెండు సార్లు ఈ విధంగా చేస్తే జుట్టు రాలమన్న రాలదు.హెయిర్ ఫాల్ ను కంట్రోల్ చేయడానికి ఈ రెమెడీ చాలా ఉత్తమంగా సహాయపడుతుంది.హెయిర్ ఫాల్ ఎంత తీవ్రంగా ఉన్నా సరే ఈ రెమెడీని పాటిస్తే చాలా త్వరగా సమస్య నుంచి బయటపడవచ్చు.
పైగా ఈ రెమెడీ వలకల జుట్టు రాలడం తగ్గి ఒత్తుగా సైతం పెరుగుతుంది.