1.పెద్ద పులి సంచారం
మహబూబ్ నగర్ జిల్లా కొత్త గూడ మండలం ఆది లక్ష్మి పురం అటవీ ప్రాంతంలో రాత్రి వేళ పెద్ద పులి సంచారం కలకలం రేపుతోంది.
2.ఆంధ్రా ధాన్యం తెలంగాణలోకి వస్తే సహించం
ఆంధ్ర ధాన్యం తెలంగాణలోకి వస్తే సహించేది లేదని తెలంగాణ అధికారులు ప్రకటించారు.ఈ మేరకు ఎక్కడికక్కడ చెక్ పోస్ట్ ఏర్పాటు చేశారు.
3.అంబేడ్కర్ రాజ్యాంగాన్ని మార్చే శక్తి ఎవరికీ లేదు
అంబేడ్కర్ రాజ్యాంగాన్ని మార్చే శక్తి ఎవరికీ లేదు అని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు.
4.కేసీఆర్ కు రాజ్యాంగం మీద గౌరవం లేదు
తెలంగాణ సీఎం కేసీఆర్ కు రాజ్యాంగం మీద గౌరవం లేదని హుజురాబాద్ బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ అన్నారు.
5.కేసీఆర్ పై మందకృష్ణ మాదిగ విమర్శలు
రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేత్కర్ ని గౌరవించని తెలంగాణ సీఎం కేసీఆర్ కు తెలంగాణ ను పాలించే హక్కు లేదని, ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ విమర్శించారు.
6.పుడింగ్ మింక్ పబ్ డ్రగ్స్ కేసు
పుడింగ్ మింక్ పబ్ డ్రగ్స్ కేసు నిందితులను పోలీసులు కస్టడీకి తరలించనున్నారు.నాలుగు రోజుల పాటు అభిషేక్, అనిల్ ను ప్రస్నించనున్నారు.
7.విహెచ్ ఇంటిపై దాడిని ఖండించిన రేవంత్ రెడ్డి
మాజీ ఎంపీ వీ హనుమంత రావు ఇంటి పై దుండగులు దాడి చేయడాన్ని తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఖండించారు.
8.ఆర్టీసీ చార్జీల పెంపు పై ఏపీలో నిరసన
ఏపీలో ఆర్టీసీ చార్జీల పెంపు పై నిరసనలు వెల్లువెత్తుతున్నాయి.పలు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు నిర్వహించారు.
9.వైఎస్ఆర్ కర్నూల్ జిల్లాలో జగన్ పర్యటన
వైఎస్సార్ కర్నూల్ జిల్లాలో ఈ నెల 15,16 తేదీల్లో ఏపీ సీఎం జగన్ పర్యటించనున్నారు.
10.పోరస్ ఫ్యాక్టరీలో ప్రమాదం బాధాకరం : పవన్ కళ్యాణ్
పోరస్ కెమికల్ ఫ్యాక్టరీ లో చోటు చేసుకున్న ప్రమాదం అత్యంత బాధాకరమని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అభిప్రాయపడ్డారు.
11.మంత్రులు అధికారులకు యూపీ సీఎం కీలక ఆదేశాలు
ప్రజలకు మెరుగైన పరిపాలన అందించడానికి అధికారులు మంత్రులు కృషి చేయాలని ఎవరు గీత దాటి ప్రవర్తించ వద్దని ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ కీలక ఆదేశాలు జారీ చేశారు.
12.ఏలూరు కెమికల్ ఫ్యాక్టరీలో ప్రమాదం
ఏలూరు పోరస్ కెమికల్ ఫ్యాక్టరీలో అగ్ని ప్రమాదం సంభవించి ఆరుగురు మృతి చెందగా, 13 మంది గాయాలపాలయ్యారు.ఈ ఘటనపై ప్రధాని నరేంద్రమోదీ విచారం వ్యక్తం చేశారు.
13.ప్రధాన మంత్రి సంగ్రహాలయాలు ప్రారంభం
ప్రధానమంత్రి సంగ్రహాలయాలను ప్రధాని నరేంద్రమోదీ ప్రారంభించారు.
13.మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన ఉషా శ్రీ
స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రిగా గురువారం ఉషశ్రీ బాధ్యతలు స్వీకరించారు.
14.ఏలూరు అగ్నిప్రమాదంపై జగన్ దిగ్భ్రాంతి.రెండు లక్షల పరిహారం
ఏలూరు కెమికల్ ఫ్యాక్టరీలో ప్రమాదం చోటు చేసుకుని ఆరుగురు మరణించడం పై ఏపీ సీఎం జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.ఈ ప్రమాదంలో మరణించిన వారికి రెండు లక్షల చొప్పున పరిహారం అని ఆయన ప్రకటించారు.
15.రాజన్న సిరిసిల్లలో కేటీఆర్ పర్యటన
రాజన్న సిరిసిల్ల లో తెలంగాణ మంత్రి కేటీఆర్ పర్యటించనున్నారు.ఈ సందర్భంగా అనేక అభివృద్ధి ఈ కార్యక్రమాలను ఆయన ప్రారంభించనున్నారు.
16.పెరిగిన ఆర్టీసీ చార్జీలు నేటి నుంచి అమలు
ఏపీలో పెరిగిన ఆర్టీసీ చార్జీలు నేటి నుంచి అమలు కానున్నాయి.
17.బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర
నేటి నుంచి తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర ప్రారంభం అయ్యింది.
18.తెలంగాణకు వర్ష సూచన
నేడు తెలంగాణలో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
19.ఈ నెల 18 నుంచి పీజీ స్పాట్ అడ్మిషన్స్
ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ ఈ నెల18 నుంచి పీజీ అడ్మిషన్స్ నిర్వహించనున్నట్టు ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ అధికారులు తెలిపారు.
20.ఈ రోజు బంగారం ధరలు
22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర – 49,550 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర – 54,060
.