ప్రస్తుత ఈ వర్షాకాలంలో చాలా మందిని కలవర పెట్టే సమస్యల్లో జుట్టు రాలడం, చుండ్రు అనేవి ముందు వరుసలో ఉంటాయి.వీటి కారణంగా తీవ్ర అసౌకర్యానికి గురవుతుంటారు.
ఈ సమస్యల నుంచి బయటపడటం కోసం రకరకాల ప్రయోగాలు చేస్తుంటారు.అయితే జుట్టు రాలడం మరియు చుండ్రు ఈ రెండు సమస్యలకు చెక్ పెట్టడానికి ముల్తానీ మట్టి( Multani Mitti ) చాలా బాగా సహాయపడుతుంది.
పురాతన కాలం నుంచి సౌందర్య ఉత్పత్తుల్లో ముల్తానీ మట్టిని వాడుతున్నారు.
అయితే చర్మానికి మాత్రమే కాదు జుట్టు సంరక్షణకు కూడా ముల్తానీ మట్టి ఉపయోగపడుతుంది.
మరి ఇంతకీ జుట్టు రాలడం( Hair Fall ) మరియు చుండ్రు( Dandruff ) సమస్యలను వదిలించుకోవడానికి ముల్తానీ మట్టిని ఎలా ఉపయోగించాలో ఇప్పుడు తెలుసుకుందాం.ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో రెండు టేబుల్ స్పూన్లు ముల్తానీ మట్టి వేసుకోవాలి.
అలాగే వన్ టేబుల్ స్పూన్ అలోవెరా జెల్, రెండు గ్లాసులు బియ్యం కడిగిన నీళ్లు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి.చివరిగా మీ రెగ్యులర్ షాంపూను మూడు నుంచి నాలుగు టేబుల్ స్పూన్లు వేసుకుని మరోసారి కలుపుకోవాలి.

ఇప్పుడు ఈ వాటర్ ను ఉపయోగించి హెయిర్ వాష్ చేసుకోవాలి.వారానికి రెండు సార్లు ఈ విధంగా చేయడం వల్ల అనేక ప్రయోజనాలను పొందుతారు.ముల్తానీ మట్టి స్కాల్ప్‌ను శుభ్రపరచడానికి, చుండ్రును నియంత్రించడానికి, స్కాల్ప్( Scalp ) ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి, రక్త ప్రసరణను పెంచడానికి ఎంతో బాగా సహాయపడుతుంది.

అలాగే ముల్తానీ మట్టి జుట్టు కుదుళ్ళను బలోపేతం చేస్తుంది.హెయిర్ ఫాల్ ను అరికడుతుంది.రైస్ వాటర్ కూడా జుట్టు రాలడాన్ని అడ్డుకోవడంలో చాలా ఉత్తమం గా సహాయపడుతుంది.
ఇక అలోవెరా జెల్ కురులకు షైనింగ్ ఎఫెక్ట్ ను ఇస్తుంది.పొడి జుట్టును రిపేర్ చేస్తుంది కురులు సిల్కీ గా మెరిసేలా ప్రోత్సహిస్తుంది.