ఇప్పటికే షూటింగ్ మధ్యలో ఆగిపోయిన సినిమాలు అలాగే మొదలుపెట్టి ఆపేసిన సినిమాలు అంతేకాకుండా అనౌన్స్మెంట్ చేసి షూటింగ్ చేయకుండా సినిమాల గురించి అనేక సార్లు అనేక ఆర్టికల్స్ లో తెలుసుకున్నాం.అయితే ఇప్పుడు ఈ మధ్యకాలంలో షూటింగ్ చేసి సినిమా పూర్తి అయినా కూడా విడుదల చేయకుండా కొన్ని సినిమాలు అలాగే ఉండిపోయాయి.
అందుకు కారణాలు ఏమైనా కావచ్చు కానీ ఆ బాక్సులు మాత్రం బయటకు రావడం లేదు ఇక పైన రిలీజ్ అవుతాయని నమ్మకం కూడా లేవు.ఇంతకీ అలా షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలవ్వకుండా అవి పోయిన సినిమాలు ఏంటి ? అనే విషయాలను ఈ అతికల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
శ్రీదేవి
( Sridevi )
రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో వచ్చిన సినిమా శ్రీదేవి.ఈ చిత్రం షూటింగ్ మొత్తం పూర్తిచేసుకుని పోస్టర్ కూడా విడుదల చేశారు.
అయితే విడుదలైన పోస్టర్ తో చాలా పెద్ద కాంట్రవర్సీ జరిగింది.దాంతో ఈ సినిమా షెడ్డు కి వెళ్ళిపోయింది.
పైగా ఈ కాన్సెప్ట్ లో ఒక చిన్న పిల్లాడు హీరోయిన్ నడుము చూస్తున్నట్టుగా ఉంటుంది.దీన్ని చూసిన బాలల హక్కుల సంఘాలు బగ్గుమన్నాయి.
ఇకపై ఈ సినిమా విడుదల అయ్యే అవకాశం లేదు.
మర్యాద కృష్ణయ్య
( Maryada krishnayya )
లాక్ డౌన్ లో సునీల్( sunil ) హీరోగా మర్యాద కృష్ణయ్య అనే ఒక సినిమా షూటింగ్ పూర్తయింది.కానీ ఈ సినిమా మొత్తం పూర్తయ్యాక నిర్మాతకు ఆ చిత్ర అవుట్ పుట్ నచ్చలేదట.చెత్త సినిమా విడుదల చేసే కన్నా విడుదల చేయకుండా ఉంటేనే బెటర్ అనుకుని ఈ సినిమాని అటకెక్కించారట.
చిత్రం చెప్పిన కథ
( chitrem cheppina katha )
ఉదయ్ కిరణ్ నటించిన చివరి సినిమా ఇది.ఆయన చనిపోయి చాలా ఏళ్లు గడుస్తున్నా కూడా కేవలం ఉదయ్ లేదు అనే కారణంతో నిర్మాత ఆ సినిమాని విడుదల చేయడం లేదు.ఒకవేళ కనుక ఆ సినిమా విడుదల చేసి ఉండి ఉంటే అభిమానులు దాన్ని ఖచ్చితంగా హిట్ చేసేవారు.