సినీ ఇండస్ట్రీలో నందమూరి కుటుంబానికి ఎంతో మంచి బ్యాక్ గ్రౌండ్ ఉంది.నందమూరి తారక రామారావు ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించి ఇండస్ట్రీలో పేరు ప్రఖ్యాతలను సొంతం చేసుకున్నారు.
ఇలా ఎన్టీఆర్ ( Sr.Ntr) వారసులుగా ఎంతో మంది ఇండస్ట్రీలోకి వచ్చారు కాని ఎవరు పెద్దగా సక్సెస్ అందుకోలేదు బాలయ్య ( Balayya ) మాత్రమే ఇండస్ట్రీలో స్టార్ హీరోగా నందమూరి లెగసినీ ముందుకు నడిపిస్తూ వచ్చారు.ఇక హరికృష్ణ పలు సినిమాలలో నటించిన అనుకున్న స్థాయిలో సక్సెస్ కాకపోయినా ఈయన కుమారులు కళ్యాణ్ రామ్( Kalyan Ram ) , జూనియర్ ఎన్టీఆర్( Jr .Ntr ) ఇండస్ట్రీలో హీరోలుగా నిర్మాతలుగా ఎంతో మచ్చ సక్సెస్ అందుకున్నారు.
నందమూరి వారసులు అంటేనే ఎన్టీఆర్ పేరే అందరికీ గుర్తొస్తుంది.ఇక హరికృష్ణ మరణం తర్వాత బాలయ్య క్రమక్రమంగా ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ ను దూరం పెడుతూ వచ్చారు.
నందమూరి కుటుంబానికి సంబంధించిన ఎలాంటి వేడుకలకు కూడా వీరికి ఆహ్వానం ఉండదు.దీంతో నందమూరి కుటుంబానికి వీరిద్దరూ దూరమయ్యారు.అయితే తాజాగా బాలయ్య ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్ తన వారసులు కాదు అంటూ బాలయ్య చేసిన ఈ వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.
ఇటీవల బాలకృష్ణ అబుదాబిలో జరిగిన ఐఫా అవార్డు ( IIFA Awards ) వేడుకలలో పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో భాగంగా బాలకృష్ణ గోల్డెన్ లెగసీ అవార్డును అందుకున్నాడు.ఇలా ఈ కార్యక్రమంలో గోల్డెన్ లెగసీ అవార్డు అందుకోవడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు.
మా నాన్నగారి నుంచి వచ్చింది.అది నాకు ఎంతో గర్వంగా ఉంది.
ఈ అవార్డు నాన్నకే అంకితం అని తెలిపారు.ఇక మీడియా వారు ఈయనని ప్రశ్నిస్తూ నందమూరి తారక రామారావు వారసుడు బాలకృష్ణ, మరి బాలకృష్ణ వారసుడు ఎవరు అనే ప్రశ్న ఎదురయింది.
ఈ ప్రశ్నకు బాలకృష్ణ సమాధానం చెబుతూ.నా కుమారుడు మోక్షజ్ఞ నా మనవళ్ళు అంతే మరి ఇంకెవరుంటారు అంటూ సమాధానం చెప్పారు.దీంతో ఎన్టీఆర్ అభిమానులు కాస్త నిరుత్సాహం వ్యక్తం చేస్తున్నారు.బాలయ్య చెప్పింది కరెక్టే కానీ ఎన్టీఆర్ కూడా తనకు కొడుకుతో సమానమే, ఎన్టీఆర్ కూడా తన వారసులు అని చెప్పొచ్చు కదా అంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.