ఆర్ఆర్ఆర్ మూవీలో చరణ్, తారక్ కలిసి నటించగా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన సంగతి తెలిసిందే.బాక్సాఫీస్ వద్ద ఎన్నో రికార్డులను బ్రేక్ చేసిన ఈ సినిమా సరికొత్త రికార్డులను క్రియేట్ చేసింది.
ఈ సినిమా తర్వాత తారక్ నటించిన దేవర సినిమా ( Devara movie )మిక్స్డ్ టాక్ తో ప్రస్తుతం థియేటర్లలో రన్ అవుతున్న సంగతి తెలిసిందే.ఈ సినిమాకు తొలిరోజే 172 కోట్ల రూపాయల కలెక్షన్లు వచ్చాయి.
ఆచార్య సినిమాలో సైతం రామ్ చరణ్ నటించినా ఆ సినిమా రిజల్ట్ ను చరణ్ ఖాతాలో వేయలేము.గేమ్ ఛేంజర్ మూవీ సాధించే కలెక్షన్ల ఆధారంగా దేవర మూవీ తుది ఫలితం గురించి ఒక అంచనాకు రావచ్చు.అయితే ఫస్ట్ డే కలెక్షన్ల విషయంలో దేవర రూపంలో గేమ్ ఛేంజర్( game changer) కు భారీ టార్గెట్ ఫిక్స్ అయింది.భారతీయుడు2 సినిమా ఫ్లాప్ కావడంతో గేమ్ ఛేంజర్ మూవీపై అంచనాలు తగ్గాయనే సంగతి తెలిసిందే.
గేమ్ ఛేంజర్ సినిమా రిలీజ్ డేట్ ను అధికారికంగా ప్రకటించకపోయినా డిసెంబర్ నెల 20వ తేదీన ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుంది.జరగండి జరగండి సాంగ్ అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించడంలో ఫెయిలైంది.తాజాగా విడుదలైన సెకండ్ సింగిల్ ప్రోమోకు సైతం మిక్స్డ్ రెస్పాన్స్ వస్తుండటం కొసమెరుపు.గేమ్ ఛేంజర్ సినిమా ఒకింత భారీ బడ్జెట్ తో తెరకెక్కగా ఈ సినిమాకు రికార్డ్ స్థాయిలో బిజినెస్ జరిగింది.
గేమ్ ఛేంజర్ మూవీ బాక్సాఫీస్ ను షేక్ చేయాలని మెగా ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.దిల్ రాజు( Dil raju ) బ్యానర్ కు సైతం ఈ సినిమా సక్సెస్ సాధించడం ఎంతో కీలకమని చెప్పడంలో సందేహం అక్కర్లేదు.
గేమ్ ఛేంజర్ సినిమాకు టికెట్ రేట్ల పెంపునకు సంబంధించి సులువుగా అనుమతులు లభించే ఛాన్స్ ఉంది.