ఈ మధ్యకాలంలో చాలా చిన్న వయసు పిల్లల నుంచి పెద్దవారి వరకు ఒక చిన్నమాటకు కూడా ఎక్కువగా కోపం వస్తోంది.కోపమనేది ఎన్నో రకాల అనర్థాలకు కారణమవుతుందని పెద్దవారు చెబుతూనే ఉంటారు.
కోపం బంధాలను, స్నేహాన్ని, ప్రేమను విడగొడుతుందని కూడా చెబుతూ ఉంటారు.అంతేకాకుండా ఇది ఆరోగ్యాన్ని కూడా నాశనం చేస్తుంది.
కోపం ఎక్కువగా రావడం వలన దాదాపు మొత్తం జీవితమే నాశనం అయ్యే ప్రమాదం ఉంది.అందుకోసమే అధికంగా కోపం ఎందుకు వస్తుందో తెలుసుకోవాల్సిన అవసరం ఉంది.
కోపం అప్పుడప్పుడు వస్తే పర్వాలేదు కానీ ఎప్పుడూ ఎక్కువగా కోపం వస్తుంటే మాత్రం దాన్ని కాస్త సీరియస్ గా తీసుకోవడమే మంచిది.
కోపం అధికంగా ఉండడం వల్ల ఏ పని మీద ఏకాగ్రత చేయలేరు.
కోపం ఎక్కువగా వస్తుంటే ఈ క్రింది కారణాలే కావచ్చు అని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.అయితే ఈ మధ్యకాలంలో ఉద్యోగాల వల్ల లేదా కుటుంబ సమస్యల వల్ల ఒత్తిడి చాలామందిలో ఉంటుంది.ఒత్తిడి ఎన్నో రకాల అనారోగ్యాలకు కారణమవుతుంది.అంతేకాకుండా ఒత్తిడి వల్ల కోపం కూడా ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది.
అది ఏ రకమైన ఒత్తిడైనా కావచ్చు కాబట్టి ఒత్తిడిని తగ్గించుకోవడం కూడా మంచిదే.ఇంట్లో ఉన్న అనారోగ్యకరమైన విషపూరితమైన వాతావరణం ఉండడం వల్ల కూడా మానసికంగా ఎన్నో రకాల ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉంది.
ఎప్పుడు కోపంగా ఉండే అవకాశం కూడా ఉంది.ఇంట్లో నిత్యం గొడవలు అరుపులు వాతావరణం వల్ల పిల్లల మానసిక పరిస్థితిని కూడా మార్చేస్తూ ఉంటుంది.ఎప్పుడు తిడితూ అరుస్తూ ఉంటే తల్లిదండ్రుల వల్ల కూడా ఎదుగుతూ ఉన్న పిల్లల్లో కోపం అధికమయ్యే అవకాశం ఉంది.గతంలో ఏదైనా చాలా బాధపడిన సందర్భాలు ఉన్నా కూడా అప్పుడప్పుడు కోపం, నిరాశ, భయం వంటివి కలుగుతూ ఉంటాయి.
ఇంకా చెప్పాలంటే చిన్న వయసులోనే భారీ బాధ్యతలు మోస్తున్న వారు కూడా తీవ్రమైన కోపం అసహనంతో ఉంటారు.మానసిక ఆరోగ్యం సరిగ్గా లేనివారు చిన్న చిన్న విషయాలకే ఎక్కువగా ఒత్తిడికి గురవుతూ ఉంటారు.
దీనివల్ల వీరిలో కోపం అధికంగా వచ్చే అవకాశం ఉంది.