నందమూరి బాలకృష్ణ హీరోగా శృతి హాసన్ హీరోయిన్ గా క్రాక్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘వీరసింహారెడ్డి’. ఈ సినిమాపై ఫ్యాన్స్ భారీ అంచనాలను పెట్టుకున్నారు.
ఎందుకంటే అఖండ వంటి బ్లాక్ బస్టర్ విజయం తర్వాత బాలయ్య ఈ సినిమా తోనే రాబోతున్నాడు.అందుకే ఈ సినిమా కోసం నందమూరి ఫ్యాన్స్ ఆసక్తిగా ఉన్నారు.
ఇప్పటికే ఈ సినిమా టాకీ పార్ట్ మొత్తం పూర్తి అయినట్టు తెలుస్తుంది.ఒక సాంగ్ మాత్రమే బ్యాలెన్స్ ఉందట.ఒక పక్క పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతుండగా.మరొక పక్క సాంగ్ కూడా పూర్తి చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
ఇదిలా ఉండగా ఈ సినిమా నుండి మేకర్స్ మరో సాంగ్ ను రిలీజ్ చేయడానికి అన్ని సన్నాహాలు చేస్తున్నారు.
ఇప్పటికే జై బాలయ్య అనే సాంగ్ రిలీజ్ అయ్యి చార్ట్ బస్టర్ గా నిలిచింది.
ఇక ఇప్పుడు మరో సాంగ్ ను రిలీజ్ చేయడానికి ముహూర్తం ఫిక్స్ చేసారు.

డిసెంబర్ 15న రెండవ పాట రిలీజ్ కాబోతుంది.బాలయ్య, శృతి కాంబోలో రాబోతున్న ఈ రొమాంటిక్ పాట సుగుణ సుందరి అని తెలుస్తుంది.ఈ సాంగ్ ఎలా ఉండబోతుందా అని అంతా ఎదురు చూస్తున్నారు.

ఇక ఈ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుంటే.కీలక పాత్రల్లో విజయ్ దునియా, వరలక్ష్మి శరత్ కుమార్ నటిస్తున్నారు.మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తున్నాడు.సంక్రాంతి వంటి సీజన్ లో రసవత్తరమైన పోటీ మధ్య బాలయ్య సినిమా ఎలా ఆకట్టు కుంటుందో వేచి ఉండాల్సిందే.







