బిగ్ బాస్ సీజన్ 6 విన్నర్ 50 లక్షలతో పాటు ఇంకా ఏమేమి గెలుచుకుంటాడో తెలుసా?

తెలుగులో ప్రసారమవుతున్న బిగ్ బాస్ సీజన్ 6 అప్పుడే చూస్తుండగానే 14 వారాలను విజయవంతంగా పూర్తి చేసుకొని 15వ వారంలోకి గ్రాండ్గా ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే.తాజాగా బిగ్ బాస్ హౌస్ నుంచి 14 వ వారం ఎలిమినేషన్స్ లో భాగంగా ఇనయ ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చిన విషయం తెలిసిందే.

 Bigg Boss Telugu 6 Winner Going To Get Huge Amount Along With Prize Money Bigg B-TeluguStop.com

దీంతో బిగ్ బాస్ షోపై, షో నిర్వాహకులపై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు ఇనయ అభిమానులు.అంతేకాకుండా బిగ్ బాస్ షో వద్దకు చేరుకొని పెద్ద ఎత్తున నినాదాలు చేసిన విషయం తెలిసిందే.

ఇకపోతే ప్రస్తుతం బిగ్బాస్ హౌస్లో కేవలం ఆరుగురు కంటెస్టెంట్లు మాత్రమే మిగిలారు.

వీరిలో టాప్ ఫైవ్లోకి ఐదు మంది వెళ్ళగా మిగిలిన ఒకరు ఎలిమినేట్ అయ్యి బయటకు రానున్నారు.

ఇది ఇలా ఉంటే ప్రస్తుతం సోషల్ మీడియాలో బిగ్ బాస్ షో విన్నర్ కి ప్రైజ్ మనీ అలాగే గిఫ్ట్ లకు సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో జోరుగా వినిపిస్తున్నాయి.చివరి వరకు బిగ్ బాస్ షో కి రావాలి అంతే శ్రమ పట్టుదల ప్రణాళిక అలాగే ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయడం ఇలా ప్రతి ఒక్కటి తప్పకుండా చేయాల్సిందే.

పోతే ఈనెల 18వ తారీఖున బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే జరుగునుంది.ఇకపోతే బిగ్ బాస్ షో ప్రైజ్ మనీ విషయానికి వస్తే.విన్నర్ గా నిలిచిన వారికి 50 లక్షలు అధికారికంగా అందించనున్నాడు బిగ్ బాస్.

దాంతో పాటుగా మరొక రెండు విలువైన బహుమతులను కూడా విజేతకు ఇవ్వనన్నారు. సువర్ణభూమి ఇన్ఫ్రా డెవలపర్స్ నుండి ఒక ఫ్లాట్ ఇవ్వనున్నారు.ఆ ఫ్లాట్ ఖరీదు దాదాపుగా 25 లక్షల అని తెలుస్తోంది.

మారుతి సుజుకి నుంచి బ్రీజా కార్ ని కూడా గెలుచుకోనున్నారు.అంటే మొత్తంగా ప్రైజ్ మనీ 50 లక్షలు ఈ రెండు బహుమతులు కలిపితే 85 లక్షలు విలువ చేసే ప్రైజ్ మనీని గెలుచుకోబోతున్నట్లు తెలుస్తోంది.

మరి ఈ సీజన్లో ఆ లక్కీ పర్సన్ ఎవరో చూడాలి మరి.ఇప్పటికే ఈసారి విన్నర్ రేవంత్ అని తేలిపోయిన విషయం తెలిసిందే.

Bigg Boss6 Winner Lakhs Prize Money with Costly Gifts

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube