ప్రస్తుత వింటర్ సీజన్ లో విరివిరిగా లభ్యం అయ్యే పండ్లలో ఆరెంజ్ ముందు వరుసలో ఉంటుంది.అద్భుతమైన రుచిని కలిగి ఉండే ఆరెంజ్ పండ్లను పెద్దలు, పిల్లలు అనే తేడా లేకుండా అందరూ ఎంతో ఇష్టంగా తింటుంటారు.
అలాగే ఆరెంజ్ పండులో ఎన్నో అమోఘమైన పోషకాలు నిండి ఉంటాయి.విటమిన్ ఎ, విటమిన్ బి, విటమిన్ సి, విటమిన్ ఈ తో పాటు కాలుష్యం, పొటాషియం, మెగ్నీషియం, ఫైబర్ వంటి పోషకాలు ఎన్నో ఆరెంజ్ లో ఉంటాయి.
శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్స్ ను సైతం ఆరెంజ్ పండు ద్వారా పొందొచ్చు.ఆరోగ్య పరంగా ఆరెంజ్ పండు అనేక ప్రయోజనాలను చేకూరుస్తుంది.
అలాగే చర్మ సౌందర్యానికి కూడా ఆరెంజ్ ఎంతో అద్భుతంగా సహాయపడుతుంది.ముఖ్యంగా మొండి మచ్చలను మాయం చేసి ముఖాన్ని తెల్లగా మార్చడానికి ఆరెంజ్ గ్రేట్ సహాయపడుతుంది.మరి ఇంతకీ క్లియర్ అండ్ వైట్ స్కిన్ ను పొందడం కోసం ఆరెంజ్ పండును ఎలా ఉపయోగించాలి అన్నది ఆలస్యం చేయకుండా ఇప్పుడు తెలుసుకుందాం.
ముందుగా ఒక ఆరెంజ్ పండును తీసుకుని సగానికి కట్ చేసి జ్యూస్ ను సపరేట్ చేసుకోవాలి.ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో మూడు నుంచి నాలుగు టేబుల్ స్పూన్లు ఆరెంజ్ జ్యూస్, రెండు టేబుల్ స్పూన్లు తేనె వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి.ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసుకుని వేళ్ళతో స్మూత్ గా మసాజ్ చేసుకోవాలి.
కనీసం ఐదు నుంచి పది నిమిషాల పాటు మసాజ్ చేసుకుని ఆ తర్వాత ముఖ చర్మాన్ని ఇరవై నిమిషాల పాటు వదిలేయాలి.
అనంతరం గోరువెచ్చని నీటితో శుభ్రంగా ఫేస్ ను క్లీన్ చేసుకోవాలి.ఆరెంజ్ పండుతో ఈ సింపుల్ చిట్కాను కనుక పాటిస్తే ఎంతటి మొండి మచ్చలు అయినా సరే క్రమంగా మాయం అవుతాయి.మొటిమలు ఉంటే చాలా త్వరగా తగ్గుముఖం పడతాయి.
పిగ్మెంటేషన్ సమస్య నుంచి విముక్తి లభిస్తుంది.క్లియర్ స్కిన్ మీ సొంతమవుతుంది.
అలాగే స్కిన్ వైట్నింగ్ కి కూడా ఈ రెమెడీ ఎంతో బాగా సహాయపడుతుంది.రోజు ఆరెంజ్ పండుతో ఈ చిట్కాను పాటిస్తే చర్మ ఛాయ అద్భుతంగా మెరుగుపడుతుంది.