పార్టీ మార్పుపై విశాఖ టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాస రావు స్పందించారు.తాను పార్టీ మారుతాననేది కేవలం ప్రచారం మాత్రమేనన్నారు.
కానీ మీడియానే తాను పార్టీ మారుతున్నానంటూ ముహుర్తాలు పెట్టి, తేదీలు ఖరారు చేస్తోందని విమర్శించారు.తాను పార్టీ మారుతానని ఎప్పుడూ చెప్పలేదని తెలిపారు.
తన ప్రమేయం లేకుండానే ప్రచారం జరుగుతోందన్నారు.పార్టీ మారే ఆలోచన ఏమైనా ఉంటే తానే చెబుతానని గంటా శ్రీనివాసరావు స్పష్టం చేశారు.