పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రెజెంట్ జోరు మీద ఉన్నాడు.ఈయన ఇమేజ్ కు తగ్గ కథలను ఎంచుకుంటూ దూసుకు పోతున్నాడు.
ఒకేసారి నాలుగు సినిమాల్లో నటిస్తూ బిజీ బిజీగా ఉన్నాడు.ప్రెజెంట్ ప్రభాస్ చేతిలో నాలుగైదు పాన్ ఇండియా సినిమాలు ఉన్నాయి.
అందులో ఆదిపురుష్, సలార్, ప్రాజెక్ట్ కే వంటి భారీ పాన్ ఇండియా సినిమాలు ఉన్నాయి.వీటిలో ఆదిపురుష్ సినిమా ఇప్పటికే షూట్ పూర్తి అయ్యింది.
ఇక సలార్, ప్రాజెక్ట్ కే సినిమాలు కూడా షూట్ జరుపు కుంటున్నాయి.వీటితో పాటు ప్రభాస్ మరో సినిమా చేస్తున్నాడు.మారుతి దర్శకత్వంలో ఒక సినిమా అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే.ఈ సినిమా షూట్ జరుగుతుంది అని మేకర్స్ అధికారికంగా ప్రకటించక పోయిన రూమర్స్ మాత్రం వస్తూనే ఉన్నాయి.
అయితే తాజాగా ఈ సినిమా నుండి ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ బయటకు వచ్చింది.
ఈ సినిమాలో డార్లింగ్ ద్విపాత్రాభినయం చేస్తున్నట్టు ఈ మధ్య రూమర్స్ వచ్చిన విషయం విదితమే.
ఇక తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ప్రభాస్ సెకండ్ క్యారెక్టర్ ఇంటర్వెల్ లో రివీల్ అవుతుంది అని సినిమా మొత్తం లోనే ఈ క్యారెక్టర్ ఎంట్రీ సీన్ హైలెట్ గా నిలవబోతుంది అని టాక్ వినిపిస్తుంది.మరి ఈ వార్తలో నిజమెంతో ముందు ముందు తెలుస్తుంది.

ఇక ఈ సినిమాలో తాత రోల్ లో సంజయ్ దత్ నటిస్తున్నాడు అంటూ టాక్.మొత్తానికి మారుతి పెద్ద ప్లాన్ తోనే ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు.ప్రభాస్ కు పూర్తిగా కొత్త జోనర్ గా ఈ సినిమా ఉండబోతుంది.ఇక ఈ సినిమాను పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై జి విశ్వప్రసాద్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.
అలాగే ఈ సినిమాలో ప్రభాస్ కు జోడీగా మాళవిక మోహనన్ తో పాటు నిధి అగర్వాల్ కూడా నటించ బోతున్నట్టు సమాచారం.







