షియోమీ తన 13 సిరీస్ స్మార్ట్‌ఫోన్లను అధికారికంగా ఆవిష్కరించబడింది.కొత్త సిరీస్‌లో వనిల్లా షియోమీ 13, షియోమీ 13 ప్రో అనే రెండు స్మార్ట్‌ఫోన్‌లు ఉన్నాయి.
ఇవి క్వాల్‌కమ్ స్నాప్‌డ్రాగన్ 8 Gen 2 ప్రాసెసర్‌తో వస్తున్నాయి.షియోమీ 13 సిరీస్ ప్రస్తుతం చైనాలో మాత్రమే లాంచ్ అయ్యాయి.
ఇతర దేశాల్లో త్వరలోనే రిలీజ్ అయ్యే అవకాశం ఉంది.చైనాలో ఈ రెండు కొత్త షియోమీ స్మార్ట్‌ఫోన్‌లు ప్రీ-ఆర్డర్ కోసం సిద్ధంగా ఉన్నాయి.
కాగా షిప్‌మెంట్స్ డిసెంబర్ 14 నుంచి ప్రారంభమవుతాయి.వనిల్లా షియోమీ 13 బేస్ 8జీబీ ర్యామ్+128జీబీ స్టోరేజ్ మోడల్ ధరను 3,999 (సుమారు రూ.47,300) యెన్లగా కంపెనీ నిర్ణయించింది.12జీబీ ర్యామ్+512జీబీ స్టోరేజ్ ధర 4,999 యెన్లుగా (దాదాపు రూ.60,000) నిర్ణయించింది.
షియోమీ 13 ప్రో ధర బేస్ 8జీబీ ర్యామ్+128జీబీ స్టోరేజ్ వెర్షన్ ధరను CNY 4,999 (దాదాపు రూ.60,000) యెన్లగా నిర్ణయించింది.ఇక 12జీబీ ర్యామ్+512జీబీ స్టోరేజ్ మోడల్ కోసం 6,299 (సుమారు రూ.74,500) యెన్లు చెల్లించుకోవలసి ఉంటుంది.షియోమీ భారతదేశంలో మరింత సరసమైన ధరకు Xiaomi 13 సిరీస్‌ని తీసుకురావచ్చు.
షియోమీ 13 స్పెసిఫికేషన్స్ తెలుసుకుంటే.దీనిలో 6.36 అంగుళాల ఓఎల్ఈడీ డిస్‌ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్, డాల్బీ విజన్, HDR10+, HLG సపోర్ట్‌ను అందిస్తుంది.

దీని ట్రిపుల్ కెమెరా సిస్టమ్‌లో ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS), 3x ఆప్టికల్ జూమ్‌తో కూడిన 10-మెగాపిక్సెల్ OIS-ఎనేబుల్డ్ టెలిఫోటో కెమెరా సెన్సార్, 12-మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ సెన్సార్‌తో కూడిన 50-మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్ ఉన్నాయి.ముందు భాగంలో, ఫుల్ హెచ్‌డీ వీడియో రికార్డింగ్‌కి సపోర్ట్ చేసే 32-మెగాపిక్సెల్ కెమెరా ఆఫర్ చేశారు.67W వైర్డ్, 50W వైర్‌లెస్ ఛార్జింగ్‌కి ఇది సపోర్ట్ చేస్తుంది.దీనిలో 4500ఎంఏహెచ్ బ్యాటరీ కెపాసిటీ ఆఫర్ చేశారు.షియోమీ 13 ప్రో స్పెసిఫికేషన్స్ తెలుసుకుంటే ఇది 120Hz రిఫ్రెష్ రేట్, డాల్బీ విజన్, HDR10 సపోర్ట్, 6.7-అంగుళాల LTPO ఓఎల్ఈడీ డిస్‌ప్లే, స్క్రీన్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్‌తో వస్తుంది.దీనిలో వైడ్, అల్ట్రా-వైడ్, టెలిఫోటో కెమెరాలన్నీ 50-మెగాపిక్సెల్ కెమెరా సెన్సార్లతో వస్తాయి.







