90వ దశకంలో జమ్మూకాశ్మీర్‌లో కశ్మీరీ పండిట్లపై( Kashmiri Pandits ) జరిగిన దారుణాలు అన్నీ ఇన్ని కావు.ఉగ్రవాదుల ధాటికి ఎంతో మంది కశ్మీరి పండిట్లు ఇళ్లు, వాకిళ్లను వదులుకుని సుదూర ప్రాంతాలకు వెళ్లి స్థిరపడ్డారు.
కాశ్మీర్ లోయలోని మైనారిటీ హిందూ జనాభాపై సరిహద్దుల్లోని తీవ్రవాదులు , వారి మద్ధతుదారులు దాడులకు తెగబడేవారు.తాజాగా 1990లో కాశ్మీర్ లోయ నుంచి కశ్మీరీ పండిట్ల వలసకు 35 ఏళ్లు నిండుతున్న సందర్భంగా యూకే పార్లమెంట్( UK Parliament ) ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టింది.
జనవరి 19ని కాశ్మీరీ పండిట్ నిర్గమ దినోత్సవంగా( Kashmiri Pandit Exodus Day ) జరుపుకోవాలని యూకే ప్రభుత్వాన్ని ఈ తీర్మానం కోరుతోంది.అలాగే భారత పార్లమెంట్‌లో ప్రతిపాదించిన ‘Panun Kashmir Genocide Crime Punishment and Atrocities Prevention Bill’ ను అమలు చేయాలని భారత ప్రభుత్వాన్ని కోరుతోంది.
ఉగ్రవాదుల చేతుల్లో ప్రాణాలు కోల్పోయిన, అత్యాచారం చేయబడిన, గాయపడిన , నిరాశ్రయులైన వారికి ఈ తీర్మానం ద్వారా సంతాపం తెలియజేసింది.అలాగే జమ్మూకాశ్మీర్‌లోని పవిత్ర స్థలాలను అపవిత్రం చేయడాన్ని ఖండిస్తోంది.
యూకేలో హిందువుల( UK Hindus ) హక్కులను కాపాడతామని, న్యాయం కోరే హక్కును కూడా కల్పిస్తామని ఈ తీర్మానంలో ప్రస్తావించారు.హింసాత్మక పరిస్ధితుల నుంచి ప్రాణాలను కాపాడుకునేందుకు పారిపోయిన వారికి 35 ఏళ్లుగా ఎలాంటి న్యాయం జరగలేదని పేర్కొన్నారు.కన్జర్వేటివ్ పార్టీకి చెందిన యూకే ఎంపీ బాబ్ బ్లాక్‌మన్( UK MP Bob Blackman ) ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టగా.దీనికి పలువురు ఎంపీలు మద్ధతు ఇచ్చారు.2015లోనూ కాశ్మీరీ పండిట్ల వలసలకు 25 ఏళ్లు గడుస్తున్న సందర్భంగా ఇలాంటి ఒక తీర్మానాన్ని యూకే పార్లమెంట్‌లో ప్రవేశపెట్టారు .
కాగా.కాశ్మీరీ పండిట్లపై జరిగిన దుర్ఘటనపై పలువురు స్థానికులు తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నారు.హిందూ – ముస్లిం అనే తేడాలు లేకుండా తామంతా ఒకప్పుడు కలిసి మెలిసి జీవించేవారమని.
కాశ్మీర్‌లో తిరిగి ప్రశాంత వాతావరణం నెలకొనాలని స్థానికులు కోరుతున్నారు.