ఈ ప్రకృతి మనకు ప్రసాదించిన ఆరోగ్యకరమైన పండ్లలో పైనాపిల్( Pineapple ) ఒకటి.ప్రత్యేకమైన రుచిని కలిగి ఉండే పైనాపిల్ లో పోషకాలు దట్టంగా ఉంటాయి.
అందువల్ల ఆరోగ్యపరంగా పైనాపిల్ అనేక ప్రయోజనాలను చేకూరుస్తుంది.అయితే ఆరోగ్యాన్నే కాదు జుట్టును కూడా ఒత్తుగా పెంచే సత్తా పైనాపిల్ కి ఉంది.
పైనాపిల్‌లో బ్రోమెలైన్ ( Bromelain )అనే ఎంజైమ్ ఉంటుంది.ఇది నెత్తిమీద రక్త ప్రవాహాన్ని పెంచుతుంది.
పెరిగిన రక్త ప్రవాహం జుట్టు కుదుళ్లకు కీలకమైన పోషకాలను చేరవేస్తుంది, ఆరోగ్యకరమైన జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది.అదనంగా బ్రోమెలైన్ చుండ్రు మరియు చికాకును తగ్గించి స్కాల్ప్ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.
ఇక ఒత్తైన జుట్టును పొందడం కోసం పైనాపిల్ ను ఎలా ఉపయోగించాలి అన్నది ఇప్పుడు తెలుసుకుందాం.ముందుగా మిక్సీ జార్ తీసుకొని అందులో ఒక కప్పు పీల్ తొలగించిన పైనాపిల్ ముక్కలు వేసి కొద్దిగా వాటర్ పోసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమం నుంచి స్టైనర్ సహాయంతో జ్యూస్ ను ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాలి.ఇప్పుడు ఈ జ్యూస్ లో వన్ టీ స్పూన్ దాల్చిన చెక్క పొడి( Cinnamon powder ) మరియు వన్ టేబుల్ స్పూన్ కోకోనట్ ఆయిల్( Coconut oil ) వేసి బాగా మిక్స్ చేస్తే మంచి హెయిర్ టానిక్ రెడీ అవుతుంది.
ఈ టానిక్ ను స్కాల్ప్ తో పాటు జుట్టు మొత్తానికి పట్టించి మసాజ్ చేసుకోవాలి.గంట అనంతరం తేలికపాటి షాంపూను ఉపయోగించి శుభ్రంగా తల స్నానం చేయాలి.రెండు వారాలకు ఒకసారి ఈ విధంగా చేయడం వల్ల జుట్టు ఎదుగుదలకు అవసరమయ్యే పోషణ అందుతుంది.కురులు ఒత్తుగా పొడుగ్గా పెరుగుతాయి.చుండ్రు సమస్య దూరం అవుతుంది.జుట్టు స్ట్రాంగ్ గా హెల్తీగా మారుతుంది.
పైగా పైనాపిల్‌లోని యాంటీ ఆక్సిడెంట్లు పర్యావరణ కారకాల వల్ల కలిగే నష్టం నుండి జుట్టును రక్షించడంలో కూడా ఉత్తమంగా సహాయపడుతుంది.