మన దేశంలో సినిమాలకు ఎంతో ప్రత్యేక స్థానం ఉంది.సినిమాల్లో నటించే యాక్టర్లను దేవుళ్లుగా కొలుస్తూ, వారి సినిమాలను ఉత్సవాల్లా జరుపుకునే సంస్కృతి ఇండియాలో విరాజిల్లుతోంది.
అలాంటి అభిమానులు తమ హీరోలను ఆదరిస్తున్న తీరు ప్రతిసారి ఒక కొత్త చరిత్రను సృష్టిస్తోంది.తాజాగా ప్రముఖ మీడియా కన్సల్టింగ్ సంస్థ ఓర్మాక్స్ మీడియా ( Ormax Media ) డిసెంబర్ 2024 సర్వే రిపోర్టును విడుదల చేసింది.
ఇందులో ఇండియాలో అత్యంత ప్రజాదరణ గల టాప్ 10 మేల్ యాక్టర్స్‌ను వెల్లడించింది.ఈ లిస్ట్‌లో టాలీవుడ్‌కు చెందిన ఐదుగురు హీరోలు చోటు దక్కించుకోవడం గర్వకారణం.
ప్రతి స్టార్ తమకంటూ ఓ ప్రత్యేక ఇమేజ్‌ను క్రియేట్ చేసుకుంటూ, ఇండియాలోనే కాదు, అంతర్జాతీయంగా కూడా తెలుగు సినిమా స్థాయిని పెంచుతున్నారు.మరీ ఆ టాప్ హీరోల లిస్ట్ చూద్దామా.
డిసెంబర్ 2024 సర్వే ప్రకారం మోస్ట్ పాపులర్ హీరోగా ప్రభాస్ నిలిచారు.‘బాహుబలి’తో పాన్ ఇండియా స్టార్‌గా మారిన ప్రభాస్, ‘కల్కి’ వంటి సినిమాలతో మరింత పాపులారిటీ సంపాదించారు.వరుస పాన్ ఇండియా సినిమాలతో ఆయన స్టార్‌డమ్ అమాంతం పెరిగిపోయింది.ఆ తరవాత ఈ లిస్టులో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నిలిచాడు.‘పుష్ప’ సినిమాతో ( ‘Pushpa’ )ఫ్యాన్ ఇండియా క్రేజ్‌ను సొంతం చేసుకున్న అల్లు అర్జున్( Allu Arjun ), ‘పుష్ప 2’ ద్వారా బాక్సాఫీస్ వద్ద సునామీ సృష్టించారు.ఈ సినిమా 1900 కోట్లు వసూలు చేసి కొత్త రికార్డులు సృష్టించింది.
ఇక మూడో స్థానంలో తమిళ హీరో దళపతి విజయ్( Tamil hero Dalapathy Vijay ) నిలిచారు.ఈ ఏడాది తన చివరి సినిమా చేస్తానని ప్రకటించిన ఆయన, అభిమానుల గుండెల్లో శాశ్వత స్థానం సంపాదించుకున్నారు.ఆపై బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ నాలుగో స్థానంలో నిలిచారు.‘జవాన్’ మరియు ‘డంకీ’ వంటి సినిమాలతో భారీ విజయాలు సాధించిన ఆయన బాలీవుడ్‌కు తిరిగి తన క్రేజ్‌ను చూపించారు.ఈ లిస్ట్ లో ఆర్ఆర్ఆర్ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన ఎన్టీఆర్, ఐదవ స్థానంలో నిలిచారు.ఎనర్జీ, నటన అభిమానులను ఎంతగానో ఆకట్టుకోవడంతో ఈ స్థానాన్ని కట్టబెట్టారు.
ఇక ఈ లిస్ట్ లో కోలీవుడ్ స్టార్ అజిత్ 6వ స్థానంలో నిలిచారు.తన సినిమాలతో దక్షిణాదిలోనే కాక, దేశ వ్యాప్తంగా గుర్తింపు పొందారు.ఇక ఈ లిస్ట్ లో టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఏడవ స్థానంలో నిలిచారు.తన స్టైలిష్ నటనతో ఈ స్థానంలో నిలిచారు.ఆపై గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఆర్ఆర్ఆర్ సినిమాలో ‘రామరాజు’ పాత్రతో ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు అందుకోవడంతో 8వ స్థానంలో నిలిచారు.అలాగే బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్, 9వ స్థానంలో నిలిచి తన పాపులారిటీని కొనసాగిస్తున్నారు.
ఇక బాలీవుడ్ ఖిలాడీ అక్షయ్ కుమార్, 10వ స్థానంలో నిలిచి తన మల్టీటాలెంటెడ్ నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.