సీనియర్ నటుడు నరేష్ ( Actor Naresh )అలాగే నటి పవిత్ర లోకేష్ ( Actress Pavitra Lokesh )ల పేర్లు మొన్నటి వరకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎంత వైరల్ అయ్యాయో మనందరికీ తెలిసిందే.అంతేకాకుండా ఈ వ్యవహారం తెలుగు సినిమా ఇండస్ట్రీలో సంచలనం సృష్టించింది.
కొంతకాలం పాటు వీరిద్దరి పేర్లు ఎక్కడ చూసినా కూడా సోషల్ మీడియాలో మారుమోగిపోయాయి.తెలుగు సినిమాల్లో బిజీ ఆర్టిస్టుగా మారిన కన్నడ నటి పవిత్ర లోకేష్ తో ఆయన బంధం వివాదానికి దారి తీసింది.
నరేష్ కు చాలా ఏళ్లుగా దూరంగా ఉన్న ఆయన భార్య రమ్య( Wife Ramya ) ఈ విషయంలో చాలా గొడవ చేసింది.దీని మీద కొన్నాళ్ల పాటు మీడియాలో ఎంత చర్చ జరిగిందో మనందరికి తెలిసిందే.
ఆ తర్వాత ఈ వ్యవహారం నెమ్మదిగా సద్దుమణిగింది.ప్రస్తుతం పవిత్ర లోకేష్ నరేష్ లు కలిసే ఉంటున్నారు.అటు నరేష్ ఇటు పవిత్ర ఇద్దరూ ఎవరికివారు సినిమాల పరంగా ఫుల్ బిజీ బిజీగా గడుపుతున్నారు. టాలీవుడ్లో బిజీ ఆర్టిస్టుల్లో ఒకరిగా వెలుగొందుతూనే వ్యక్తిగత జీవితంలోనూ సంతోషంగా సాగిపోతున్నారు.
సంక్రాంతికి విడుదలైన బ్లాక్ బస్టర్ మూవీ సంక్రాంతికి వస్తున్నాం చిత్రంలో( Sankrantiki vastunnam ) ఆయన కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే.ఈ సందర్భంగా విలేకరులను కలిసిన ఆయనకు.
పవిత్ర లోకేష్ గురించి ప్రశ్న ఎదురైంది.పవిత్ర మీ జీవితంలోకి వచ్చాక వచ్చిన మార్పులేంటి అని అడగ్గా, ఆయన దానికి ఆసక్తికర సమాధానం ఇచ్చారు.
ఈ సందర్భంగా నరేష్ మాట్లాడుతూ.పవిత్ర నా జీవితంలోకి వచ్చాక టైటానిక్ షిప్ ఒడ్డుకు చేరింది.సినిమా వాళ్లుగా మాది విభిన్నమైన జీవితం.మేం చెడ్డ వాళ్లం కాదు.మాకు ఎమోషన్లు ఎక్కువ.మా సమయాన్ని వ్యక్తిగత జీవితం కంటే సినిమా కోసమే ఎక్కువ కేటాయించాల్సి ఉంటుంది.
ఫ్యామిలీ టైం తక్కువ ఉంటుంది.అలాంటపుడు మనల్ని అర్థం చేసుకునే వ్యక్తి జీవిత భాగస్వామిగా రావడం ముఖ్యం.
నా అదృష్టం కొద్దీ ఇదే ఇండస్ట్రీకి చెందిన పవిత్ర నా జీవితంలోకి వచ్చింది.కాబట్టి ఆమె నన్ను బాగా అర్థం చూసుకుంటోంది.
ఆమె రావడం వల్ల టైటానిక్ షిప్ తీరం చేరినట్లయింది అని నరేష్ తెలిపారు.ఈ సందర్భంగా నరేష్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.