షుగర్ వ్యాధి.దీనిని మధుమేహం, డయాబెటిస్ ( Diabetes )అని కూడా పిలుస్తారు.
దీర్ఘకాలిక వ్యాధుల్లో షుగర్ వ్యాధి ఒకటి.ఇటీవల రోజుల్లో ఇంట్లో ఒక్కరికైనా సరే మధుమేహం ఉంటుంది.
మధుమేహం బారిన పడటానికి కారణాలు అనేకం.జన్యుపరంగా వచ్చే అవకాశాలు కూడా చాలా అధికంగా ఉంటాయి.
మీ ఇంట్లో కూడా ఎవరికైనా షుగర్ వ్యాధి ఉందా.? అయితే మీకు రాకుండా ఉండాలంటే కచ్చితంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.మరి ఆ జాగ్రత్తలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
అధిక బరువు( Overweight ) మధుమేహం బారిన పడటానికి ప్రధాన కారణాల్లో ఒకటి.
అందుకే బాడీ వెయిట్ ను కంట్రోల్( Control body weight ) లో ఉంచుకోవాలని ఆరోగ్య నిపుణులు ఎప్పటికప్పుడు చెబుతుంటారు.వెయిట్ కంట్రోల్ లో ఉండాలి అంటే నోరు అదుపులో ఉండాలి.
ఏది పడితే అది తినేస్తే బాడీలో క్యాలరీలు పెరుగుతాయి.కాబట్టి హెల్తీ ఫుడ్ ను డైట్ లో చేర్చుకోండి.
ఆయిలీ ఫుడ్స్, జంక్ ఫుడ్స్, బేకరీ ఫుడ్స్, షుగర్, షుగర్ తో తయారు చేసిన స్వీట్స్, కూల్ డ్రింక్స్ కు దూరంగా ఉండండి.తద్వారా బ్లడ్ షుగర్ లెవల్స్( Blood sugar levels ) నియంత్రణలో ఉంటాయి.

అలాగే షుగర్ వ్యాధికి దూరంగా ఉండాలి అనుకుంటే కచ్చితంగా రోజుకు అరగంటైనా ఏదో ఒక వ్యాయామం చేయండి.వాకింగ్( walking ) రన్నింగ్, స్కిప్పింగ్, స్విమ్మింగ్.ఇలా మీకు నచ్చిన వ్యాయామాన్ని ఎంచుకొని డైలీ రొటీన్ లో భాగం చేసుకోండి.ఒత్తిడికి ఎంత దూరంగా ఉంటే డయాబెటిస్ వచ్చే రిస్క్ అంత తగ్గుతుంది.కాబట్టి చిన్న చిన్న విషయాలకు కూడా ఒత్తిడి పడటం మానుకోండి.రోజు తినే ఆహారంలో కార్బోహైడ్రేట్స్, షుగర్స్ తక్కువగా.
ప్రోటీన్స్, విటమిన్స్, మినరల్స్, ఫైబర్ వంటి పోషకాలు ఎక్కువగా ఉండేలా చూసుకోండి.

గంటల తరబడి కూర్చునే అలవాటు ఉంటే మానుకోండి.కనీసం గంటకు ఒక్కసారైనా పైకి లేచి అటు ఇటు నడవడానికి ప్రయత్నించండి. ధూమపానం( smoking ) అలవాటుకు గుడ్ బై చెప్పండి.
ఇక కంటి నిండా నిద్ర ఉండేలా చూసుకోండి.కంటి నిండా నిద్ర లేకపోతే ఒత్తిడి పెరుగుతుంది.
ఒత్తిడి పెరిగితే బరువు పెరుగుతారు.బరువు పెరిగితే మధుమేహంతో జీవితాంతం సావాసం చేయాల్సిందే.
అందుకే రోజుకు ఆరు నుంచి ఎనిమిది గంటలైనా నిద్ర ఉండేలా చూసుకోండి.డయాబెటిస్ కు దూరంగా ఉండండి.







