వావ్.. ఇది కదా అసలైన రోహిత్ శర్మ.. హృదయాలను గెలుచుకున్నాడుగా

ముంబైలోని( Mumbai ) ప్రముఖ క్రికెట్ స్టేడియం వాంఖడే స్టేడియం 50వ వార్షికోత్సవాన్ని ఘనంగా జరుపుకుంది.ఈ ప్రత్యేక కార్యక్రమానికి ముంబై క్రికెట్ దిగ్గజాలు సచిన్ టెండూల్కర్, సునీల్ గవాస్కర్, రవిశాస్త్రి లాంటి ప్రముఖులు హాజరయ్యారు.

 Wow This Is The Real Rohit Sharma Winning Hearts, Wankhede Stadium, 50th Anniver-TeluguStop.com

అయితే, భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ ( Captain Rohit Sharma )ఈ వేడుకలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు.ఈ కార్యక్రమంలో ఛాంపియన్స్ ట్రోఫీతో రోహిత్ శర్మ ఫోటోషూట్ చేసేందుకు మాజీలకు ఆహ్వానం అందింది.

ఈ నేపథ్యంలో రోహిత్ చూపిన వ్యక్తిత్వం, గౌరవతత్వాన్ని చాటుతూ అందరినీ ఆశ్చర్యపరిచాడు.

ఛాంపియన్స్ ట్రోఫీతో దిగ్గజ క్రికెటర్లందరూ కలిసి ఫొటోలు దిగాలని ఆయన కోరాడు.ఈ ఘటన అభిమానుల మనసులను దోచుకున్నాడు.ప్రస్తుతం ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

వీడియోలో సునీల్ గవాస్కర్, రవిశాస్త్రి రోహిత్‌ను ( Sunil Gavaskar, Ravi Shastri to Rohit )ట్రోఫీ దగ్గరికి రావాలని కోరగా, రోహిత్ సౌమ్యంగా తిరస్కరించి, సీనియర్ ఆటగాళ్లను వేదిక మధ్యలోకి రావాలని కోరాడు.ఆ సమయంలో సచిన్ టెండూల్కర్, రవిశాస్త్రి, గవాస్కర్ లను ట్రోఫీ వెనుక కుడివైపు ఉండి పోజులివ్వగా.

రోహిత్ వేదికకు ఎడమవైపున చివరగా నిలిచాడు.

ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ( ICC Champions Trophy )2025 ఫిబ్రవరి 19 నుంచి ప్రారంభం కానుంది.పాకిస్తాన్‌తో ఉన్న రాజకీయ సమస్యల కారణంగా, టీమ్ ఇండియా తన మ్యాచ్‌లను దుబాయ్‌లో ఆడనుంది.ఈ ట్రోఫీ నేపథ్యంలో ఫిబ్రవరి 20న భారత జట్టు బంగ్లాదేశ్‌తో తొలి మ్యాచ్ ఆడనుంది.

ఆ తర్వాత ఫిబ్రవరి 23న పాకిస్తాన్‌తో టీమ్ ఇండియా ముఖాముఖి తలపడనుంది.ఈ కార్యక్రంలో భాగంగా రోహిత్ శర్మ మాట్లాడుతూ.ఛాంపియన్స్ ట్రోఫీని భారత్‌కు తీసుకురావడానికి మా జట్టు శక్తివంచన లేకుండా కృషి చేస్తుందని పేర్కొన్నాడు.మొత్తానికి వాంఖడే 50వ వార్షికోత్సవ వేడుకలు క్రికెట్ ప్రేమికులకు ఒక ప్రత్యేక అనుభూతిని కలిగించాయి.

రోహిత్ శర్మ చూపించిన గౌరవతత్వం, అతని భావోద్వేగభరిత చర్యలు క్రికెట్ అభిమానుల గుండెల్లో ఎప్పటికీ నిలిచిపోతాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube