1.ఫలక్ నూమా ఎక్స్ ప్రెస్ లో అగ్ని ప్రమాదం
హౌరా నుంచి సికింద్రాబాద్ కు వస్తున్న ఎక్స్ప్రెస్( Falaknuma express ) అగ్ని ప్రమాదానికి గురి కావడంతో సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు రెండు రైళ్ళను క్యాన్సిల్ చేశారు.
2.బిజెపి తోనే అభివృద్ధి సాధ్యం : కొండ
బిజెపితోనే తెలంగాణలో అభివృద్ధి సాధ్యమవుతుందని మాజీ ఎంపీ కొండ విశ్వేశ్వర్ రెడ్డి అన్నారు.
3.ఆశా వర్కర్లకు గుడ్ న్యూస్
తెలంగాణలో పనిచేస్తున్న 27 వేల మంది ఆశా వర్కర్లకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది.ఈ నెల నుంచి ఆశ వర్కర్లకు ఇచ్చిన సెల్ ఫోన్ బిల్లులు కూడా ప్రభుత్వమే చెల్లిస్తుందని మంత్రి హరీష్ రావు( T.Harish Rao ) తెలిపారు.
4.అనంతపురం జిల్లాలో జగన్ పర్యటన
వైసీపీ అధినేత ఏపీ సీఎం జగన్ రేపు అనంతపురం జిల్లాలో పర్యటించనున్నారు.
5.జనసేన తోనే కలిసి ముందుకు వెళ్తాం : బిజెపి
ఏపీలో జనసేనతో కలిసే ఎన్నికలకు వెళ్తామని బిజెపి ఏపీ ప్రధాన కార్యదర్శి మాధవ్ అన్నారు.
6.మల్లారెడ్డి కళాశాల అధికారులకు ఈడి నోటీసులు
తెలంగాణ మంత్రి మల్లారెడ్డి( Malla Reddy ) కళాశాల అధికారులకు ఈడి అధికారులు నోటీసులు జారీ చేశారు .మెడికల్ కాలేజీల్లో సీట్ల కుంభకోణం పై ఈడీ అధికారులు విచారణను వేగవంతం చేశారు.
7.వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రమాణం చేసిన ఎమ్మెల్యే అనిల్
టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేసిన వ్యాఖ్యలకు నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ స్పందించారు.తనపై చేసిన ఆరోపణలు నిరూపించేందుకు ప్రమాణం చేయాలని లోకేష్ కు అనిల్ కుమార్ యాదవ్ సవాల్ విసిరారు.ఈరోజు అనిల్ నెల్లూరు సిటీలోని వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రమాణం చేశారు.
8.లోకేష్ కు నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి విమర్శలు
టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తనకు 15 వందల కోట్ల ఆస్తులు ఉన్నాయని ఆరోపించారని అందులో ఒక శాతం ఇవ్వు చాలు అని కోవూరు ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్ కుమార్ రెడ్డి అన్నారు.
9.రెండో దశ వారహి యాత్ర
ఏలూరు నుంచి వారాహి రెండో దశ యాత్ర ప్రారంభించాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నిర్ణయించుకున్నారు.
10.బీఆర్ఎస్ ,కాంగ్రెస్ పై కిషన్ రెడ్డి విమర్శలు
బీఆర్ఎస్, కాంగ్రెస్ బొమ్మ బొరుసు లాంటివని తెలంగాణలో నీతివంతమైన పాలన తీసుకొస్తామని బిజెపి తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు.
11.రేవంత్ రెడ్డికి మతిస్థిమితం లేదు
తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి మతిస్థిమితం లేదని మంత్రి కేటీఆర్ విమర్శించారు.
12.రేపు వరంగల్ కు ప్రధాని
భారత ప్రధాని నరేంద్ర మోది రేపు వరంగల్ కు రానున్నారు.ఈ మేరకు ఆయన సభను సక్సెస్ చేయాలని కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ పిలుపునిచ్చారు.
13.మన తెలంగాణ పార్టీకి కోర్టు జరిమానా
మన తెలంగాణ పార్టీపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది .అనవసర పిటిషన్లతో కోర్టు సమయాన్ని వృధా చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ, 50,000 జరిమానా విధించింది.
14.వరంగల్ కు కిషన్ రెడ్డి
కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి ఈరోజు ఉదయం వరంగల్ లో పర్యటించారు.ఈ సందర్భంగా భద్రకాళి అమ్మవారిని ఆయన దర్శించుకున్నారు.
15.నేడు భారీ వర్షాలు
తెలంగాణలో నేడు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.
16.జై భీమ్ భారత్ పార్టీ అధ్యక్షుడి విమర్శలు
జగన్ వదిలిన బాణం షర్మిల పాదయాత్ర చేయలేదా తాము రాజధాని లోని తూళ్లూరు అంబేద్కర్ విగ్రహం నుంచి శాఖమూరు అంబేద్కర్ స్మృతి వనం వరకు పాదయాత్ర నిర్వహించి తీరుతామని, ఏపీ ప్రభుత్వానికి జై భీమ్ భారత్ పార్టీ అధ్యక్షుడు జడ శ్రవణ్ కుమార్ సవాల్ చేశారు.
17.కెసిఆర్ పై బండి సంజయ్ ఆగ్రహం
నిజమైన హిందువు అని చెప్పుకునే సీఎం కేసీఆర్ ఎందుకు గజ్వేల్ ఘటనపై స్పందించడం లేదని కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ప్రశ్నించారు.
18.అమర్నాథ్ యాత్రకు బ్రేక్
కాశ్మీర్ లోయలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అమర్నాథ్ యాత్ర(amarnath-yatra )ను ఈ రోజు నిలిపివేశారు.
19.జెసి ప్రభాకర్ రెడ్డి సవాల్
చీనా తోటలో పంట లేకుండానే ఎమ్మెల్యే పెద్దారెడ్డి పంట బీమా సొమ్ము కొట్టేసాడని జెసి ప్రభాకర్ రెడ్డి విమర్శించారు.