'భోళా శంకర్'పై మేకర్స్ అదిరిపోయే అప్డేట్.. నెక్స్ట్ సాంగ్ ఎప్పుడంటే ?

మెగాస్టార్ చిరంజీవి( Chiranjeevi ) భోళా శంకర్ ( Bhola Shankar )గా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సమయం ఆసన్నం అయ్యింది.మరో నెల రోజుల్లోనే ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

 Bholaa Shankar Movie Second Song Update, Bhola Shankar Song, Bhola Shankar, Meg-TeluguStop.com

దీంతో మెగా ఫ్యాన్స్ ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్నారు.చిరంజీవి హీరోగా మెహర్ రమేష్( Meher Ramesh ) దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ ‘భోళా శంకర్’.

తమిళ్ వేదాళం సినిమాకు రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా ఆగస్టులో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

తమన్నా హీరోయిన్ గా నటిస్తుండగా.కీర్తి సురేష్ ( Keerthy Suresh )చిరు చెల్లెలుగా నటిస్తుంది.మహతి స్వర సాగర్ సంగీతం అందిస్తున్నాడు.

అనిల్ సుంకర ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నాడు.అలాగే ఈ సినిమాను ఆగస్టు 11న గ్రాండ్ గా రిలీజ్ చేయబోతున్నారు.

రిలీజ్ కు దగ్గర పడుతుండడంతో ఈ సినిమా నుండి వరుసగా ప్రమోషనల్ కంటెంట్ రిలీజ్ చేస్తూ అంచనాలు మరింత పెంచేస్తున్నారు.

ఇప్పటికే భోళా మ్యానియా సాంగ్, టీజర్ రిలీజ్ అవ్వగా అదిరిపోయే రెస్పాన్స్ లభించింది.ఇక ఇప్పుడు ఈ సినిమా సెకండ్ సాంగ్ పై మేకర్స్ అఫిషియల్ గా అప్డేట్ ఇచ్చారు.మ్యూజికల్ అప్డేట్ రావడంతో మెగా ఫ్యాన్స్ మరోసారి ఎగ్జైటింగ్ గా ఎదురు చూస్తున్నారు.

నెక్స్ట్ సాంగ్ సెలబ్రేటింగ్ సాంగ్ అంటూ చెబుతూ త్వరలోనే రిలీజ్ డేట్ పై అప్డేట్ ఇస్తామని ప్రకటించారు.

అంతేకాదు మహతి స్వర సాగర్ ఈ సాంగ్ కు మంచి ట్యూన్ ఇచ్చినట్టు తెలిపారు.

మరి సాంగ్ ఎప్పుడు రిలీజ్ చేస్తారో వేచి చూడాలి.ఇక ఈ మధ్యనే మెగాస్టార్ షూటింగ్ తో పాటు డబ్బింగ్ కూడా పూర్తి చేసి భార్య సురేఖతో కలిసి వెకేషన్ కు వెళ్ళాడు.

మళ్ళీ ప్రమోషన్స్ ముందు ఇండియా వచ్చే అవకాశం కనిపిస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube