Chiranjeevi : ఏంటి చిరు ఇది.. మనవరాల్ని వదిలేసి భార్యతో ట్రిప్ ప్లాన్ చేశాడుగా?

మెగాస్టార్ చిరంజీవి( Megastar Chiranjeevi ) గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు.మూడు దశాబ్దాలకు పైగా ఇండస్ట్రీలో కొనసాగుతున్న చిరు ఇప్పటికీ యంగ్ హీరోలతో పాటు తన వారసులతో పోటీగా బాగా పరుగులు తీస్తున్నాడు.

 Chiru He Left His Grandchildren And Planned A Trip With His Wife-TeluguStop.com

కెరీర్ మొదటి నుంచి ఇప్పటివరకు వెను తిరిగి చూడకుండా ప్రయాణించి టాలీవుడ్ ఇండస్ట్రీలో చెరగని ముద్ర సొంతం చేసుకున్నాడు.తనే కాకుండా తన వారసులను, సోదరులను కూడా ఇండస్ట్రీకి పరిచయం చేశాడు చిరు.

ప్రస్తుతం చిరు వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు.ఇక ఈయన వ్యక్తిగత విషయాల గురించి కూడా అందరికీ తెలిసిందే.

ఎంతోమందికి సహాయం చేసిన చిరు ఇప్పటికీ తన వంతు సహాయం చేస్తూనే ఉన్నాడు.ఇక ఈయన అల్లు రామలింగయ్య( Allu Ramalingaiah ) కూతురు సురేఖను పెళ్లి చేసుకోగా రామ్ చరణ్ తో పాటు ఇద్దరు ఆడపిల్లలకు జన్మనిచ్చారు.

రామ్ చరణ్( Ram Charan ) ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో గ్లోబల్ స్టార్ గా పేరు సంపాదించుకున్నాడు.తండ్రి హోదాతో అడుగుపెట్టి ఆ తర్వాత సొంత టాలెంట్ ని ప్రేక్షకులకు పరిచయం చేసి మంచి అభిమానాన్ని సంపాదించుకున్నాడు.ఇక చరణ్ ఉపాసనని పెళ్లి చేసుకోగా రీసెంట్ గా పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చారు ఈ దంపతులు.ఇంటికి మహాలక్ష్మి రావటంతో చిరంజీవి ఫ్యామిలీ అంతా సంతోషంలో మునిగిపోయింది.

ఇక ఇటీవలే పాపకు క్లిన్ కారా( Klin Kara ) అనే పేరు పెట్టి ఉయ్యాల ఫంక్షన్ కూడా చేశారు.ఇంతకాలం ఉపాసన డెలివరీ కోసం ఎదురుచూసిన ఫ్యామిలీ పాప పుట్టటంతో ఇప్పుడు ఎవరి పనులు వాళ్ళు చూసుకుంటున్నారు.

రామ్ చరణ్ కూడా వరుస షూటింగ్లో పాల్గొంటున్నాడు.ఇక చిరంజీవి కూడా ప్రస్తుతం భోళా శంకర్ సినిమాలో చేస్తున్న సంగతి తెలిసిందే.

అయితే ప్రస్తుతం సినిమా పరంగా కాస్త బ్రేక్ దొరకడంతో చిరంజీవి తన భార్య సురేఖతో( Surekha ) కలిసి ఒక చిన్న ట్రిప్ కు వెళ్తున్నట్లు కనిపించింది.ఇక చిరంజీవి తన భార్య సురేఖతో జర్నీలో దిగిన ఫోటోలను కూడా పంచుకున్నాడు.నెక్స్ట్ షూట్ కి పోయేముందు రిఫ్రెష్ కావటానికి తన వైఫ్ తో చిన్న ట్రిప్ అని తెలిపాడు.ప్రస్తుతం ఆ ఫోటోలు బాగా వైరల్ అవ్వటంతో ఆయన ఫ్యాన్స్ బాగా లైక్స్ కొడుతున్నారు.

మీరిద్దరు ఎప్పుడు ఇలాగే కలిసి ఉండాలి అంటూ కామెంట్లు పెడుతున్నారు.

ఇక మరి కొంతమంది.ఇంట్లో మనవరాలితో సరదాగా ఆడుకోకుండా.ఈ సమయంలో ట్రిప్స్ ఏంటి అంటూ సరదాగా కామెంట్లు పెడుతున్నారు.

ఇంత కాలానికి మీ ఇంట్లోకి మహాలక్ష్మి వచ్చింది కదా.తనతో కాసేపు ఆడుకోవచ్చు కదా అంటూ చరణ్ అభిమానులు తెగ కామెంట్లు పెడుతున్నారు.ఇక మరి కొంతమంది ఇంట్లో మనవరాలిని వదిలేసి భార్యతో ట్రిప్ ఎంజాయ్ చేస్తున్నాడు గురు అని అంటున్నారు.ఇక ఒక్కొక్కరు ఒక్కొక్క లాగా కామెంట్లు పెడుతున్నారు.త్వరలో చిరంజీవి భోళాశంకర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎటువంటి హిట్ అందుకుంటాడో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube