సందీప్ రెడ్డి వంగా డార్లింగ్ ప్రభాస్(Sandeep Reddy Vanga, Darling Prabhas) కాంబినేషన్ లో ప్రస్తుతం ఒక సినిమా రాబోతున్న విషయం తెలిసిందే.ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే ఎన్నో రకాల వార్తలు కూడా వినిపించాయి.
యానిమల్ (Animal )సినిమా తర్వాత సందీప్ రెడ్డి (sandeep reddy )తెరకెక్కిస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై అంచనాలు ఒక రేంజ్ లో ఉన్నాయి.ఈ సినిమా బడ్జెట్ కూడా భారీగా ఉంటుందని తెలుస్తోంది.
సందీప్ వంగా ఈ ఒక్క సినిమాను బ్లాక్ బస్టర్ చేస్తే, ఇండియా టాప్ డైరక్టర్ గా నిలబడిపోతారు.ఎందుకంటే ఆయన కథ చిత్రం బాలీవుడ్ మూవీ యానిమల్ సృష్టించిన సంచలనం ఇంతా అంతా కాదు.
దాని తర్వాత ప్రభాస్ తో చేస్తున్న స్పిరిట్ సక్సెస్ తోడైతే సందీప్ వంగా క్రేజ్ ఒక లెవెల్ కు చేరుతుందని చెప్పాలి.అయితే ఈ సినిమా షూట్ త్వరలో మొదలు కాబోతోందట.
ఈ నేపథ్యంలో దర్శకుడు సందీప్ వంగా హీరో ప్రభాస్ (Hero prabhas) కు కొన్ని సూచనలు చేసినట్లు తెలుస్తోంది.అలాగే కొన్ని డిమాండ్లు ప్రభాస్ ముందు ఉంచినట్లు తెలుస్తోంది.
అందులో మొదటిది ఎట్టి పరిస్థితుల్లోనూ సినిమా జూన్ నుంచి ప్రారంభం కావాలని కోరినట్లు తెలుస్తోంది.సందీప్ వంగా బౌండ్ స్ట్రిప్ట్ (Bound Strip)తో రెడీగా ఉన్నారట.
అందువల్ల జూన్ లో స్టార్ట్ చేస్తే సంక్రాంతిని టార్గెట్ చేయవచ్చని సందీప్ ఆలోచనగా తెలుస్తోంది.అలాగే మరో డిమాండ్ ఏమిటంటే కంటిన్యూగా 65 రోజులు కాల్ షీట్లు ఇవ్వాలన్నది.

పెద్దగా బ్రేక్స్ లేకుండా ప్రభాస్ 65 రోజులు కాల్ షీట్ లు ఇస్తే చకచకా సినిమా పూర్తి చేయాలన్నది సందీప్ ప్లానింగ్ లో భాగమని తెలుస్తోంది.అలాగే మూడో డిమాండ్ కాస్త చిత్రంగా వినిపిస్తోంది.ఇటీవల కాలంలో బాలీవుడ్ లో మాదిరిగా తెలుగులో కూడా బాడీ డబుల్ లేదా డూప్ (Body double ,dupe)సంస్కృతి విస్తరిస్తోంది.లాంగ్ షాట్ లు, బ్యాక్ షాట్ లు, క్లోజ్ (Long shots, back shots, close ups)లు మినహా మిగిలిన షాట్ లు ఎక్కువగా బాడీ డబుల్స్ తో చేస్తున్నారు.
దీనికి ఏ హీరో కూడా పెద్దగా మినహాయింపు కాదు.అయితే తన సినిమాకు బాడీ డబుల్ అన్నది కుదరదు అని సందీప్ వంగా ముందే క్లారిటీ ఇచ్చేసినట్లు తెలుస్తోంది.
సినిమా టోటల్ షాట్ లు అన్నీ హీరోనే డైరక్ట్ గా చేయాలని కోరినట్లు వినిపిస్తోంది.మొత్తానికి సందీప్ వంగా తన సినిమా ను పూల్ ప్రూఫ్ గా పెర్ ఫెక్ట్ గా లాండ్ చేయాలని డిసైడ్ అయినట్లు కనిపిస్తోంది.
ఈ డిమాండ్లకు ప్రభాస్ కూడా ఓకే చెప్పినట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి.