మాండూస్ తుపాను ప్రభావంతో తిరుపతి జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి.తిరుమలలో ఎడతెరపి లేకుండా కురుస్తున్న వానలతో భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
వర్షంతో పాటు చలి తీవ్రత అధికంగా ఉంది.
మరోవైపు శ్రీవారి మెట్టు మార్గంలో భారీగా వరద నీరు ప్రవహిస్తోంది.
దీంతో అప్రమత్తమైన టీటీడీ కొండచరియలు విరిగి పడే ప్రాంతాల్లో భక్తుల రాకపోకలను నిలిపివేసింది.పాపనాశనం, శిలాతోరణం మార్గాలను మూసివేసినట్లు ప్రకటించింది.
కాగా తిరుమలలోని అన్ని జలాశయాలు నిండుకుండలను తలపిస్తున్నాయి.