కెమికల్స్ తో పండించిన మామిడి పండ్లను ఇలా సులభంగా గుర్తించండి..!

వేసవి కాలం( Summer )లో చాలా మంది ప్రజలు ఇష్టంగా తినే పండ్లలో మామిడి పండ్లు మొదటి స్థానంలో ఉంటాయి.ఎందుకంటే ఇవి ఎంతో రుచిగా ఉండడంతో చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు వీటిని ఎంతో ఇష్టంగా తింటూ ఉంటారు.

 Identify Mangoes Grown With Chemicals Easily Like This..! ,mangoes , Summer ,-TeluguStop.com

అయితే ఈ మధ్యకాలంలో కొంతమంది వ్యాపారస్తులు త్వరగా కాయలు పండ్లు కావాలని ఉద్దేశంతో కెమికల్స్ తో వీటిని పండిస్తున్నారు.అయితే చెట్లపై పండాల్సిన మామిడి పండ్లు రసాయనలతో పక్వానికి వస్తున్నాయి.

దీంతో ఎన్నో అనారోగ్య సమస్యల బారిన పడే అవకాశం ఉంది.

Telugu Chemicals, Tips, Latest, Mango, Mango Pulp, Mangoes-Telugu Health Tips

ఇంతకీ మార్కెట్లో అమ్మే మామిడి పండ్లు సహజమైనవా, రసాయనాలతో పండించినవా ఎల గుర్తించాలో ఇప్పుడు తెలుసుకుందాం.సహజంగా పండే మామిడి పండ్ల కంటే కృతిమంగా పండే పండ్లు ఎక్కువగా ఆకర్షణంగా ఉంటాయి.రసాయనాలతో పండించిన పండు పై అక్కడక్కడ మచ్చలు ఉంటాయి.

అలాగే మామిడిపండు సైజు చిన్నగా ఉంటుంది.ఇలా పండించిన పండ్లలో ఎక్కువ భాగం రసమే ఉంటుంది.

Telugu Chemicals, Tips, Latest, Mango, Mango Pulp, Mangoes-Telugu Health Tips

వీటిని తినడానికి కట్ చేసినప్పుడు ఎరుపు, పసుపు కలిగిన ప్రకాశవంతమైన రంగులో ఈ పండు గుజ్జు ఉంటుంది.ముఖ్యంగా చెప్పాలంటే సహజంగా పండిన మామిడి పండ్లలో గుజ్జు, రసం( Mango juice ) ఎక్కువగా ఉంటాయి.అంతేకాకుండా కెమికల్స్ తో పండిన మామిడి పండ్లు తీపి తక్కువగా ఉంటాయి.ఇంకా చెప్పాలంటే తెలుపు రంగు, నీలం రంగు మచ్చలున్న మామిడి పండ్లను అసలు కొనకూడదు.

Telugu Chemicals, Tips, Latest, Mango, Mango Pulp, Mangoes-Telugu Health Tips

ముఖ్యంగా చెప్పాలంటే మామిడి పండ్లు కొనడానికి ముందు ఒక పండు తీసుకుని దాన్ని నీరు ఉన్న బకెట్లో వేయాలి.మామిడిపండు మునిగితే సహజమైనదిగా పైకి తేలితే రసాయనాలతో పండినట్లుగా గుర్తించవచ్చు. కెమికల్స్( Chemicals ) తో కూడిన ఈ రకమైన మామిడి పండ్లను కొనకుండా ఉండడమే మంచిది.ఇలాంటి మామిడి పండ్లు తినడం వల్ల చాలా రకాల అనారోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube