టాలీవుడ్ యాంకర్, నటి అనసూయ భరద్వాజ్( Anasuya Bhardwaj ) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.మొన్నటి వరకు యాంకర్ గా తన సత్తాను నిరూపించుకున్న అనసూయ ప్రస్తుతం వెండితెరపై వరుసగా సినిమా అవకాశాలు అందుకుంటూ నటిగా నిరూపించుకుంటోంది.
కాగా అనసూయ ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్న విషయం తెలిసిందే.ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ చేతిలో అరడజన్ కు పైగా సినిమాలు ఉన్నాయి.
ఇది ఇలా ఉంటే అనసూయ ఈ మధ్యకాలంలో సినిమాల విషయాలకంటే ఎక్కువగా ద్వారా సోషల్ మీడియాలో ఎక్కువగా వార్తల్లో నిలుస్తోంది.తరచూ ఏదో ఒక కాంట్రవర్సీతో వార్తల్లో నిలుస్తోంది రంగమ్మత్త.

ముఖ్యంగా ఇటీవల కాలంలో అనసూయ సోషల్ మీడియాలో చేసే ట్వీట్ లు కాంట్రవర్సీలకు దారి తీస్తున్నాయి.తాజాగా అనసూయ చేసిన ట్వీట్ పై విజయ్ దేవరకొండ( Vijay Devarakonda ) అభిమానులు మండిపడుతున్నారు.కాగా ఎప్పటినుంచో విజయ్ దేవరకొండ అభిమానులు అనసూయ మధ్య వార్ నడుస్తున్న విషయం తెలిసిందే.గతంలో చాలాసార్లు వీరిద్దరి మధ్య సోషల్ మీడియా వేదికగా వార్ జరిగింది.
గత ఏడాది విడుదల అయినా లైగర్ సినిమా రిజల్ట్ విషయంలో అనసూయ చేసిన ట్వీట్ నెట్టింట దుమారం రేపడంతో అనసూయ పై విజయ్ ఫ్యాన్స్ దారుణంగా ట్రోలింగ్స్ చేసిన విషయం తెలిసిందే.ఇక తాజాగా విజయ్ దేవరకొండను ఉద్దేశించిన ట్వీట్ పెట్టిందంటూ మండిపడుతున్నారు.

తాజాగా అనసూయ తన ట్వీట్ లో ఈ విధంగా రాసుకొచ్చింది.ఇప్పుడే ఒకటి చూశాను.The naa?? బాబోయ్!!! పైత్యం.ఏం చేస్తాం.అంటకుండా చూసుకుందాం.అంటూ ట్వీట్ చేసింది.కాగా ఆ ట్వీట్ చూసిన విజయ్ అభిమానులు మండిపడుతున్నారు.అనసూయపై నెగిటివ్ గా కామెంట్స్ చేస్తూ ట్రోల్స్ చేస్తున్నారు.
ఎందుకు నీకు సంబంధం లేని విషయాల్లో ప్రతిసారి దూరతావు అంటూ మండిపడుతున్నారు.నువ్వు ఇలా చేస్తావ్ కాబట్టే నీ విషయంలోనూ అందరూ దూరుతారు.
ఆంటీ అంటూ మళ్లీ ట్రోలింగ్ మొదలు పెట్టారు.ఆ The ప్రొడక్షన్ హౌజ్ నుంచే రెమ్యూనరేషన్ కూడా తీసుకున్నావ్ అంటూ గుర్తు చేస్తున్నారు.
విజయ్ దేవరకొండ తాజాగా నటిస్తున్న ఖుషి( Khushi ) సినిమా నుంచి తాజాగా మూవీ మేకర్స్ విడుదల చేసిన పోస్టర్ ని ఉద్దేశించి అనసూయ ఈ విధంగా ట్వీట్ చేసింది అంటూ అభిమానులు మండిపడుతున్నారు.







